Breaking News

పిచ్‌తో మైండ్‌గేమ్‌.. కలవరపడుతున్న 'కంగారూలు'

Published on Tue, 03/07/2023 - 16:41

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మ్యాచ్ జరిగిన తీరు కంటే పిచ్‌లపైనే ఎక్కువగా ఆసక్తి ఏర్పడింది. తొలి రెండు మ్యాచ్‌లను టీమిండియా రెండున్నర రోజుల్లో ముగిస్తే.. మూడో టెస్టులో అది రివర్స్‌ అయింది. ఇండోర్‌ టెస్టును కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా అదే రెండున్నర రోజుల్లో మ్యాచ్‌ను ముగించింది.  అయితే ఇండోర్‌ పిచ్‌కు పూర్‌ రేటింగ్‌ ఇచ్చిన ఐసీసీ మూడు డీమెరిట్‌ పాయింట్లు కేటాయించింది. దీంతో నాలుగో టెస్టు జరగనున్న అహ్మదాబాద్ పిచ్‌పై ఆసక్తి ఏర్పడింది. నరేంద్రమోదీ స్టేడియం పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందా లేక బ్యాటింగ్‌, బౌలింగ్‌కు సమాంతరంగా ఉంటుందా అనేది వేచి చూడాలి.

తొలి మూడు టెస్టులకు సంబంధించి పిచ్‌ ఫోటోలు ఎలా వైరల్‌ అయ్యాయో తాజాగా అహ్మదాబాద్‌ పిచ్‌ ఫోటోలు కూడా సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అయితే ఈసారి పిచ్‌ ఫోటోలు చూసినవారికి కాస్త కన్ఫూజన్‌ ఏర్పడింది. సోషల్‌ మీడియాలో విడుదలైన ఫోటోల్లో రెండు పిచ్‌లు కనిపించాయి. ఆ రెండు పిచ్‌లపై కవర్స్‌ కప్పి ఉంచారు. దీంతో మ్యాచ్‌లో ఏ పిచ్‌ ఉపయోగిస్తారనేది క్లారిటీ లేదు.

ఈ విషయం గమనించిన ఆస్ట్రేలియా మీడియా అహ్మదాబాద్‌ పిచ్‌లపై కన్ఫూజన్‌కు గురైంది. ''మ్యాచ్‌ను గెలవడానికి టీమిండియా ఏమైనా చేస్తుందని.. మ్యాచ్ ప్రారంభమయ్యే ఆఖరి నిమిషం వరకు ఏ పిచ్‌పై ఆడాలనేది రివీల్‌ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వారి ప్రణాళికలు మా గేమ్‌ప్లాన్‌ను దెబ్బతీసేలా ఉన్నాయి.'' అంటూ కథనం ప్రచురించింది. ఇది తెలుసుకున్న టీమిండియా అభిమానులు.. ''పాపం ఆసీస్‌ మీడియాలో కలవరం మొదలైనట్లుంది.. కచ్చితంగా నాలుగో టెస్టులో టీమిండియాదే విజయం'' అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇక మార్చి 9 నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌ వేదికగా ఆఖరి టెస్టు మొదలుకానంది. ఈ మ్యాచ్‌ గెలవడం ఆస్ట్రేలియా కంటే టీమిండియాకు ఎంతో ముఖ్యం. డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టాలంటే భారత్‌ ఈ మ్యాచ్‌ తప్పకుండా గెలిచి తీరాల్సిందే. ఒకవేళ టీమిండియా ఓడినా లేక మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అది జరగకుండా ఉండాలంటే టీమిండియా నాలుగో టెస్టును నెగ్గితే సరిపోతుంది.

చదవండి: IPL 2023: లక్నో కొత్త జెర్సీ.. మరీ ఇంత చెత్తగా ఉందేంటి? దీని కంటే..

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)