Breaking News

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా అతడే..

Published on Tue, 11/18/2025 - 07:36

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ సారథి ప్యాట్‌ కమిన్స్‌పై విశ్వాసం ఉంచింది. 2026 సీజన్‌లో కూడా కమిన్స్‌ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని సన్‌రైజర్స్‌ యాజమాన్యం సోమవారం ఎక్స్‌ వేదికగా ప్రకటించింది. కమిన్స్‌ వరుసగా మూడో సీజన్‌లో జట్టు నాయకత్వ బాధ్యతలు చేపడుతున్నాడు. 2024లో కమిన్స్‌ కెప్టెన్సీలో ఫైనల్‌ చేరి రన్నరప్‌గా నిలిచిన జట్టు... గత సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 6 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో ముగించింది. 

ప్లే ఆఫ్స్‌కు చేరడంలో విఫలమైనా... 15 మంది ఆటగాళ్లను టీమ్‌ అట్టిపెట్టుకుంది. కమిన్స్‌ సారథ్యంలో రెండు సీజన్లు కలిపి 30 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ 15 గెలిచి, 14 ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ప్రస్తుతం కమిన్స్ వెన్నునొప్పి గాయం నుండి కోలుకుంటున్నాడు.

ఈ క్ర‌మంలో అత‌డు పెర్త్ వేదిక‌గా జరగనున్న యాషెస్ తొలి టెస్టుకు దూర‌మ‌య్యాడు. అత‌డి స్ధానంలో స్టీవ్ స్మిత్ ఆసీస్ జ‌ట్టుకు సార‌థ్యం వ‌హించనున్నాడు. అయితే డిసెంబ‌ర్ 4 నుంచి బ్రిస్బేన్‌లో ప్రారంభమయ్యే రెండో టెస్టు నాటికి క‌మ్మిన్స్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినున్న‌ట్లు తెలుస్తోంది.

ముచ్చటగా మూడో సీజన్‌..
కాగా 31 ఏళ్ల క‌మ్మిన్స్ ఐపీఎల్ 2024లో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించాడు. ఆ సీజ‌న్ మెగా వేలంలో అత‌డిని రూ.20.50 కోట్ల భారీ ధ‌ర‌కు ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, 2023 ODI ప్రపంచ కప్‌లో ఆసీస్‌ను క‌మ్మిన్స్ విజేత‌గా నిల‌ప‌డంతో త‌మ జ‌ట్టు ప‌గ్గాల‌ను క‌మ్మిన్స్‌కు ఎస్ఆర్‌హెచ్ అప్ప‌గించింది. 

కెప్టెన్‌గా త‌న అరంగేట్ర సీజ‌న్‌లో ఎస్ఆర్‌హెచ్‌ను ఫైన‌ల్ వ‌ర‌కు క‌మ్మిన్స్ తీసుకెళ్లాడు. ఆ త‌ర్వాత సీజ‌న్‌లో ఆరెంజ్ ఆర్మీ చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయింది. అయిన‌ప్ప‌టికి మ‌రోసారి క‌మ్మిన్స్‌పై ఎస్ఆర్‌హెచ్ యాజ‌మాన్యం మ‌రోసారి న‌మ్మ‌కం ఉంచింది. ఇక ఐపీఎల్‌-2026 వేలానికి ముందు స‌న్‌రైజ‌ర్స్ స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ(రూ.10 కోట్లు)ని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు ట్రేడ్ చేసింది.  స్టార్ స్పిన్నర్లు ఆడమ్ జంపా, రాహుల్ చాహర్‌లను కూడా స‌న్‌రైజ‌ర్స్‌ విడుదల చేసింది.

ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్‌ చేసుకున్న ఆట‌గాళ్లు వీరే..
పాట్ కమిన్స్ (కెప్టెన్‌), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్. స్మరన్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, జీషన్ అన్సారీ.
చదవండి: IND vs PAK: పాక్‌తో మ్యాచ్‌.. వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం
 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)