Breaking News

ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు కొట్టిన కమిన్స్‌

Published on Fri, 06/27/2025 - 16:53

ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) చరిత్ర సృష్టించాడు. అరవై రెండేళ్లుగా రిచీ బెనాడ్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు కొట్టాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన కెప్టెన్‌గా అవతరించాడు. వెస్టిండీస్‌ (WI vs AUS)తో మ్యాచ్‌ సందర్భంగా కమిన్స్‌ ఈ ఘనత సాధించాడు.

విండీస్‌ పర్యటనలో ఆసీస్‌ జట్టు
విండీస్‌తో మూడు టెస్టులు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు అక్కడకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం (జూన్‌ 25) మొదలైన తొలి టెస్టుకు బార్బడోస్‌లోని కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ మైదానం వేదిక.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పర్యాటక ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. విండీస్‌ పేసర్ల ధాటికి తాళలేక 180 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్‌ పేసర్లలో జేడన్‌ సీల్స్‌ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. షమార్‌ జోసెఫ్‌ (Shamar Joseph) నాలుగు వికెట్లు పడగొట్టాడు. జస్టిన్‌ గ్రీవ్స్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.

రెండు వికెట్లు తీసిన కెప్టెన్‌
ఈ క్రమంలో తమ మొదటి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆతిథ్య వెస్టిండీస్‌ 190 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ అత్యధికంగా మూడు వికెట్లు కూల్చగా.. జోష్‌ హాజిల్‌వుడ్‌, కెప్టెన్‌ కమిన్స్‌, బ్యూ వెబ్‌స్టర్‌ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌కు ఒక వికెట్‌ దక్కింది.

ఇక విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో కమిన్స్‌ కేసీ కార్టీ (20), కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ (44) వికెట్లు తీయడం ద్వారా.. అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసీస్‌ కెప్టెన్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు రిచీ బెనాడ్‌ పేరిట ఉండేది. ఇక ఈ జాబితాలో ఓవరాల్‌గా పాకిస్తాన్‌ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రథమ స్థానంలో ఉండగా.. కమిన్స్‌ రెండో స్థానానికి చేరుకున్నాడు.

టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్లు
🏏ఇమ్రాన్‌ ఖాన్‌(పాకిస్తాన్‌): 1982-1992 మధ్య కాలంలో కెప్టెన్‌గా 187 వికెట్లు
🏏ప్యాట్‌ కమిన్స్‌ (ఆస్ట్రేలియా): 2021-2025* మధ్య కాలంలో కెప్టెన్‌గా 139 వికెట్లు
🏏రిచీ బెనాడ్‌ (ఆస్ట్రేలియా): 1958- 1963 మధ్య కాలంలో కెప్టెన్‌గా 138 వికెట్లు
🏏గ్యారీ సోబర్స్‌ (వెస్టిండీస్‌): 1965- 1972 మధ్య కాలంలో కెప్టెన్‌గా 117 వికెట్లు
🏏డానియల్‌ వెటోరి (న్యూజిలాండ్‌): 2007-2011 మధ్య కెప్టెన్‌గా 116 వికెట్లు
🏏కపిల్‌ దేవ్‌ (ఇండియా): 1983- 1997 మధ్య కాలంలో కెప్టెన్‌గా 111 వికెట్లు.

చదవండి: సచిన్‌ సర్‌ కొడుకు.. అర్జున్‌పై ఎలా అరవగలను?.. కెప్టెన్‌గా ఉన్నపుడు జరిగిందిదే!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)