Breaking News

చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులోకి సిరాజ్‌! కారణం ఇదే!

Published on Mon, 01/27/2025 - 13:17

చాంపియన్స్‌ ట్రోఫీ-2025 భారత జట్టులో మహ్మద్‌ సిరాజ్‌(Mohammed Siraj)కు చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ఈ ఐసీసీ టోర్నీకి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(BCCI) ప్రకటించిన జట్టులో ఒకే ఒక్క పేసర్‌ పూర్తి ఫిట్‌గా ఉండటం ఇందుకు కారణమని పేర్కొన్నాడు. 

మిగతా ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్ల ఫిట్‌నెస్‌పై స్పష్టత రావడం లేదు కాబట్టి.. సిరాజ్‌ మియా దుబాయ్‌ ఫ్లైట్‌ ఎక్కడం ఖాయంగానే కనిపిస్తుందని పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్‌ వేదికగా ఫిబ్రవరి 19న చాంపియన్స్‌ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఆడనుంది. 

హైదరాబాదీ పేసర్‌కు దక్కని చోటు
ఈ నేపథ్యంలో జనవరి 18న బీసీసీఐ ఈ మెగా ఈవెంట్‌కు తమ జట్టును ప్రకటించగా.. ఇందులో హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు మాత్రం చోటు దక్కలేదు. పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah)తో పాటు మరో సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీని ఎంపిక చేసిన సెలక్టర్లు.. యువ తరంగం, పొట్టి ఫార్మాట్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న అర్ష్‌దీప్‌ సింగ్‌కు కూడా స్థానం ఇచ్చారు. 

అందుకే పక్కన పెట్టామన్న కెప్టెన్‌
ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘బుమ్రా పూర్తి ఫిట్‌గా ఉంటాడో లేదో తెలియదు. ఇక షమీతో పాటు అర్ష్‌దీప్‌ కొత్త బంతితో రాణించగలడు. 

అంతేకాదు.. డెత్‌ ఓవర్లలోనూ బాగా బౌలింగ్‌ చేయగలడు. అయితే, సిరాజ్‌ మాత్రం ఆరంభంలో చూపినంత ప్రభావం ఆఖర్లో చూపలేకపోతున్నాడు. అందుకే అతడిని పక్కనపెట్టాల్సి వచ్చింది’’ అని వివరణ ఇచ్చాడు.

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ
అయితే, తాజా పరిస్థితులు చూస్తుంటే సిరాజ్‌కు చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ లభించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. టోర్నీ నాటికి బుమ్రా వంద శాతం ఫిట్‌నెస్‌ సాధించే సూచనలు కనిపించడం లేదు. 

అదే విధంగా.. షమీ కూడా ఇంత వరకు రీఎంట్రీ ఇవ్వలేదు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇంగ్లండ్‌తో తొలి రెండు టీ20లకు అతడు దూరమైనా.. నెట్స్‌లో కుంటుతూ బౌలింగ్‌ చేసిన దృశ్యాలు అభిమానులను కలవరపెడుతున్నాయి.

సిరాజ్‌కు చోటు పక్కా
ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘షమీ గురించి కాసేపు పక్కనపెడతాం. బుమ్రా గురించి మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాచారం రావడం లేదు. ప్రస్తుతం చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో ఒక్క పేసర్‌ మాత్రమే ఫిట్‌గా ఉన్నాడు.

మిగతా ఇద్దరు(బుమ్రా, షమీ) సంగతి తెలియదు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు జట్టుకు దూరమైతే.. ఆటోమేటిక్‌గా సిరాజ్‌ జట్టులోకి వచ్చేస్తాడు. కాబట్టి సిరాజ్‌ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి. బాగా ప్రాక్టీస్‌ చేయాలి.

చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడబోతున్నానని భావించి పూర్తి ఫిట్‌గా.. అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలి. గాయం నుంచి కోలుకున్న తర్వాత షమీ ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడలేదు. 

ఇక బుమ్రా ఒక్క వన్డేలోనూ భాగం కాలేదు. కాబట్టి సిరాజ్‌కు గనుక చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడే అవకాశం వస్తే నాకైతే సంతోషమే’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా చాంపియన్స్‌ ట్రోఫీకి ప్రకటించిన ప్రాథమిక జట్టులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది.

చదవండి: పరాయి స్త్రీలను తాకను.. ఇంత పొగరు పనికిరాదు!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)