Breaking News

ముంబైతో మ్యాచ్‌.. జూనియర్‌ మలింగ అద్భుత గణాంకాలు

Published on Sat, 05/06/2023 - 18:15

ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మే 6, మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే పేసర్‌ మతీష పతిరణ అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన పతిరణ.. తనకు మాత్రమే సాధ్యమైన స్వింగింగ్‌ యార్కర్లతో ముంబై బ్యాటర్లను బెంబేలెత్తించి, 3 వికెట్లు కీలక పడగొట్టాడు. అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసిన పతిరణ.. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై బ్యాటర్లను కట్టడి చేశాడు.

చదవండి: నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్‌ దక్కకుండా చేస్తాడు: ఇషాన్‌ కిషన్‌ video

తన కోటా ఓవర్లలో పతిరణ ఒక్కటంటే ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం​. ఈ మ్యాచ్‌లో స్పెల్‌తో పతిరణ మరోసారి తాను మలింగకు అసలుసిసలు వారసుడని నిరూపించుకున్నాడు. పతిరణతో పాటు దీపక్‌ చాహర్‌ (3-0-18-2), తుషార్‌ దేశ్‌పాండే (4-0-26-2) విజృంభించడంతో ముంబై ఇండియన్స్‌ కేవలం 139 పరుగులకే పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్‌లో నేహల్‌ వధేరా (64) ఒక్కడే రాణించాడు. 

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్‌కేకు ఓపెనర్లు డెవాన్‌ కాన్వే (25 నాటౌట్‌), రుతురాజ్‌ (30) మెరుపు ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడుతున్న రుతురాజ్‌ ఐదో ఓవర్‌ తొలి బంతికి పియూష్‌ చావ్లా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం క్రీజ్‌లో వచ్చిన రహానే (21) సైతం ముంబై బౌలర్లపై ఎదురుదాడి చేస్తున్నాడు. దీంతో సీఎస్‌కే 8.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 81 పరుగులు చేసింది.  

చదవండి: రోహిత్‌ డకౌట్‌ వెనుక ధోని మాస్టర్‌మైండ్‌!video
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)