Breaking News

సీఎస్‌కే అభిమానులకు అదిరిపోయే కౌంటరిచ్చిన జడేజా

Published on Wed, 05/24/2023 - 13:10

గత కొంత కాలంగా (ఐపీఎల్‌ 2022 నుంచి) తనను మానసిక వేదనకు గురి చేస్తున్న సొంత జట్టు అభిమానులకు సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అదిరిపోయే కౌంటరిచ్చాడు. నిన్నటి క్వాలిఫయర్‌ 1 మ్యాచ్‌లో తనకు లభించిన అప్‌స్టాక్స్‌ మోస్ట్‌ వ్యాల్యువబుల్‌ అసెట్‌ (అత్యంత విలువైన ఆస్తి) అవార్డుకు సంబంధించిన ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. తనను టార్గెట్‌ చేసిన అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయే సమాధానం చెప్పాడు. అప్‌స్టాక్స్‌కు తెలిసింది కానీ.. కొంతమంది అభిమానులకు ఇంకా తెలియడం లేదని కామెంట్‌ జోడించి.. తన విలువ తెలియని అభిమానులకు చురకలంటించాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

కాగా, గత కొంత కాలంగా సీఎస్‌కే అభిమానులు.. సొంత జట్టు ఆటగాడు అని కూడా చూడకుండా రవీంద్ర జడేజాను మాటల తూటాలతో వేధిస్తున్నారు. జడ్డూ ఎంతగా రాణిస్తున్నప్పటికీ (ఈ ఒక్క సీజన్‌లోనే 3 మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు) వారు అతన్నే టార్గెట్‌ చేస్తూ బాధపెడుతున్నారు. తొందరగా ఔటై వెళ్లిపోవాలని.. తమకు ధోని ఆటను చూడాలని ఉందని ప్లకార్డ్‌లు ప్రదర్శిస్తూ ఘోరంగా అవమానిస్తున్నారు. ఏ టాలెంట్‌ లేని ఆటగాడినే ఇలా అవమానిస్తే ఊరుకోడు.. అలాంటిది, తన జట్టు కోసం అహర్నిశలు శ్రమించే ఓ ఆటగాడిని ఇంతలా అగౌరవపరిస్తే ఎలా ఊరుకుంటాడు. సమయం వచ్చినప్పుడు ఇదే తరహాలో తనను అవమానించిన వారికి బుద్ధి చెప్తాడు. 

ఇదిలా ఉంటే, కొద్ది రోజుల కింద ఓ నెటిజన్‌ చేసిన ఓ ట్వీట్‌కు లైక్‌ కొట్టినప్పుడు తొలిసారి సీఎస్‌కే అభిమానులపై జడేజాకు ఉన్న అసంతృప్తి బయటపడింది. ఆ ట్వీట్‌లో ఏముందంటే.. తాను ఎప్పుడెప్పుడు ఔటైతానా అని అభిమానులు ఎదురుచూశారని జడేజా నవ్వుకుంటూ చెప్పిన మాటల్లో లోలోపల చాలా బాధ దాగి ఉంది. నమ్మండి ఆ బాధ ట్రామా లాంటిది. సీజన్‌లో మూడు సార్లు  మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలిచి కూడా సొంత జట్టు అభిమానులే ఎప్పుడెప్పుడు ఔటవుతాడా అని ఎదురుచూడటం చాలా బాధాకరం. బాగా రాణిస్తున్నప్పటికీ కూడా ఫ్యాన్స్‌ మద్దతు లభించకపోతే ఆ బాధ వర్ణణాతీతం అంటూ రాజ్‌కుమార్‌ అనే నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. ఈ వివాదాస్పద ట్వీట్‌కే జడ్డూ లైక్‌ కొట్టాడు.     

ఆ తదనంతర పరిణామాల్లో (మే 20న ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయానంతరం) ధోని-జడేజా మధ్య వాగ్వాదం జరిగినట్లు లైవ్‌లో కనిపించడం, ఆ తర్వాత జడేజా ఓ వివాదాస్పద ట్వీట్‌ (కర్మ మన వద్దకు తిరిగి వస్తుంది, అది రావడం కాస్త లేటవుతుందేమో కానీ, తప్పక వస్తుంది) చేయడం, దానికి అతని భార్య రివాబా రీట్వీట్‌ (నీ దారిలో నువ్వు వెళ్లు అంటూ చేతులు జోడించిన ఐకా​న్‌తో ట్వీట్‌) చేయడం వంటి విషయాలు జరిగాయి. ఈ తంతు మొత్తం జరిగాక నిన్న (మే 23) జరిగిన క్వాలిఫయర్‌ 1 మ్యాచ్‌లో జడేజా-ధోని కలిసిపోయినట్లు కనిపించారు. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే.. గుజరాత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది.

చదవండి: ఫైనల్‌కు ముందు సీఎస్‌కేకు బిగ్‌ షాక్‌.. ధోనిపై నిషేధం! ఏం జరగనుంది?

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)