Breaking News

స్కూల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడనున్న సీఎస్‌కే స్టార్‌

Published on Tue, 06/13/2023 - 15:31

సీఎస్‌కే స్టార్‌ పేసర్‌ తుషార్‌దేశ్‌ పాండే త్వరలో ఒక ఇంటివాడు కానున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్‌ ఫ్రెండ్ నభా గడ్డంవార్‌తో సోమవారం కుటుంబసభ్యుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక‌కు ప‌లువురు చెన్నై సూప‌ర్ కింగ్స్ క్రికెట‌ర్లు హాజ‌ర‌య్యారు.

తుషార్‌, న‌భా ఎంగేజ్‌మెంట్ ఫొటోను సీఎస్‌కే బ్యాట్స్‌మెన్ శివ‌మ్ దూబే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. స్కూల్ డేస్ నుంచి తుషార్‌, న‌భాకు మ‌ధ్య ప‌రిచ‌యం ఉంద‌ట‌. న‌భాతో ఎంగేజ్‌మెంట్‌ గురించి తుషార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు.

స్కూల్ క్ర‌ష్ నుంచి త‌న భార్య‌గా న‌భా ప్ర‌మోష‌న్ పొంద‌నుంద‌ని పేర్కొన్నాడు. కొత్త జంట‌కు సూర్య‌కుమార్ యాద‌వ్‌, రుతురాజ్ గైక్వాడ్‌తో పాలు ప‌లువురు క్రికెట‌ర్లు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తున్నారు. త‌మ ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను తుషార్ కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

కాగా రూ. 20 ల‌క్ష‌ల బేస్ ధ‌ర‌కు తుషార్ దేశ్‌పాండే ను చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది. త‌న‌కు ధ‌ర‌కు ప‌దింత‌ల న్యాయం చేశాడు తుషార్‌. అద్భుత బౌలింగ్‌తో అద‌ర‌గొట్టిన తుషార్ ధోని నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సీజ‌న్‌లో 16 మ్యాచుల్లో 21 వికెట్లు తీశాడు. ఒకానొక ద‌శ‌లో ప‌ర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు. అద్భుత బౌలింగ్‌తో చెన్నై క‌ప్ గెల‌వ‌డంతో తుషార్ దేవ్‌పాండే త‌న వంతు పాత్ర‌ను పోషించాడు. గ‌త సీజ‌న్‌లో పెద్ద‌గా అవ‌కాశాలు రాకా బెంచ్‌కు ప‌రిమిత‌మైన తుషార్ ఈ సీజ‌న్‌లో మాత్రం చెల‌రేగిపోయాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: విభిన్నంగా ఆడి వరల్డ్‌కప్‌ కొట్టబోతున్నాం: రోహిత్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)