Breaking News

IPL 2024: ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేకు భారీ షాక్‌ 

Published on Thu, 03/21/2024 - 14:45

ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌కు ముందు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు డెత్‌ ఓవర్స్‌ స్పెషలిస్ట్‌, శ్రీలంక పేస్‌ సంచలనం మతీశ పతిరణ లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సందర్భంగా పతిరణ గాయపడ్డాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో పతిరణకు శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఎన్‌ఓసీ ఇవ్వలేదు.

పతిరణ ‌త్వరలోనే గాయం నుంచి పూర్తిగా కోలుకుంటాడని తెలుస్తుంది. సీజన్‌ ప్రారంభానికి ముందు సీఎస్‌కేకు ఇది రెండో ఎదురుదెబ్బ​. కొద్ది రోజుల ముందు ఈ జట్టు ఓపెనింగ్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే కూడా గాయం కారణంగా లీగ్‌కు (మే వరకు) దూరమయ్యాడు. సీఎస్‌కే యాజమాన్యానికి కాన్వే స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద సమస్య కానప్పటికీ.. పతిరణ స్థానాన్ని భర్తీ చేయడమే పెద్ద తలనొప్పిగా మారింది.

కాన్వే స్థానంలో అతని దేశానికే చెందిన రచిన్‌ రవీంద్ర ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారు కాగా.. పతిరణ స్థానం కోసం బంగ్లా పేసర్‌ ముస్తాఫిజుర్‌, మొయిన్‌ అలీ, శార్దూల్‌ ఠాకూర్‌ పేర్లను పరిశీలిస్తున్నారు. ముస్తాఫిజుర్‌ కూడా డెత్‌ ఓవర్స్‌ స్పెషలిస్టే కావడంతో సీఎస్‌కే యాజమాన్యం ఇతని వైపే మొగ్గు చూపవచ్చు.

సీఎస్‌కే తొలి మ్యాచ్‌కు వేదిక అయిన చెపాక్‌ స్టేడియం​ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో మొయిన్‌ అలీ పేరును కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. కెప్టెన్‌ ధోని, బౌలింగ్‌ కోచ్‌ బ్రావో.. శార్దూల్‌ ఠాకూర్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం​.

కాగా, ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో సీఎస్‌కే.. ఆర్సీబీతో తలపడనున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్‌ వేదికగా రేపు (మార్చి 22) రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. 

తుది జట్లు (అంచనా):
సీఎస్‌కే: రుతురాజ్‌ గైక్వాడ్‌, రచిన్‌ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్‌ మిచెల్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, మహీశ్‌ తీక్షణ, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌

ఆర్సీబీ: విరాట్‌ కోహ్లి, ఫాఫ్‌ డుప్లెసిస్‌ (కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌, కెమరూన్‌ గ్రీన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, దినేశ్‌ కా​ర్తీక్‌ (వికెట్‌కీపర్‌), అనూజ్‌ రావత్‌, అల్జరీ జోసఫ్‌, సిరాజ్‌, కర్ణ్‌ శర్మ, ఆకాశ్‌దీప్‌ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)