Breaking News

అతడిని వదులుకున్నందుకు చాలా బాధగా ఉంది.. మమ్మల్ని టార్చర్ పెట్టేవాడు: సీఎస్‌కే కోచ్‌

Published on Mon, 05/15/2023 - 18:43

ఐపీఎల్‌-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్‌ చక్రవర్తి మరో సారి తన స్పిన్‌ మయాజాలన్ని ప్రదర్శించాడు. తన 4 ఓవర్ల కోటాలో 36 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు.

అతడితో పాటు సునీల్‌ నరైన్‌ కూడా కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు.  ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన వరుణ్‌.. 19 వికెట్లు తీసి   అత్యధిక వికెట్లు తీసిన  జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక అద్భుతంగా రాణిస్తున్న వరుణ్‌ చక్రవర్తిపై సీఎస్‌కే హెడ్‌ కోచ్‌  స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వరుణ్‌ చక్రవర్తి నెట్‌ బౌలర్‌గా ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బంది పెట్టేవాడని ఫ్లెమింగ్ అన్నాడు. 

సీసీఎస్‌కే, కేకేఆర్‌ మ్యాచ్‌ అనంతరం ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. "వరుణ్‌ను వదులుకున్నందుకు మేము ఇప్పటికీ బాధపడుతున్నాం. అతడు నెట్స్ లో మమ్మల్ని టార్చర్ పెట్టేవాడు. అతడొక అద్భుతమైన మిస్టరీ స్పిన్నర్‌. నెట్స్‌లో అతడి బౌలింగ్‌ చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. అయితే దురదృష్టవశాత్తూ వేలంలో అతడిని మేము సొంతం చేసుకోలేకపోయాం.

గతేడాది వేలంలో కూడా అతడిని దక్కించుకోవడానికి ప్రయత్నించాం. కానీ మళ్లీ అతడిని కేకేఆర్‌ భారీ ధరకు సొంతం చేసుకుంది. చెపాక్‌ వంటి స్పిన్‌ పిచ్‌లపై చక్రవర్తి మరింత అద్భుతంగా రాణించగలడు. నేటి మ్యాచ్‌లో కూడా చక్రవర్తి చాలా బాగా బౌలింగ్ చేశాడు" అతడు పేర్కొన్నాడు.
చదవండి: అతడిని భారత జట్టులోకి తీసుకోండి.. సరిగ్గా వాడుకుంటే అద్భుతాలు సృష్టిస్తాడు

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి