Breaking News

సంబురాల్లో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

Published on Sun, 04/09/2023 - 16:07

ముంబై ఇండియన్స్‌పై గెలుపుతో సంబురాల్లో మునిగితేలుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ చాహర్‌ గాయం తిరగబెట్టడంతో తదుపరి సీఎస్‌కే ఆడబోయే 4-5 మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వస్తుంది. నిన్న  (ఏప్రిల్‌ 8) ముంబైతో జరిగిన మ్యాచ్‌లో గాయం (లెఫ్ట్‌ హ్యామ్‌స్ట్రింగ్‌) తిరగబెట్టడడంతో కేవలం ఒక్క ఓవర్‌ మాత్రమే వేయగలిగిన చాహర్‌.. అది వేసేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు.

గాయాల కారణంగా ఇప్పటికే పలువురు ఆటగాళ్ల సేవలు కోల్పోయిన సీఎస్‌కేకు చాహర్‌ గాయంం మరింత కలవరానికి గురి చేస్తుంది. చాహర్‌ గత సీజన్లోనూ ఇలాగే మధ్యలోనే వైదొలిగి, సీజన్‌ మొత్తానికే దూరం అయ్యాడు. ప్రస్తుతానికి సీఎస్‌కే ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పర్వాలేదనిపిస్తున్నప్పటికీ, చాహర్‌ అందుబాటులో ఉండడన్న విషయం ఆ జట్టును ఆందోళనకు గురి చేస్తుంది. 

ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత రవీంద్ర జడేజా బంతితో (4-0-20-3) ఇరగదీయగా.. ఆతర్వాత బ్యాటింగ్‌లో వెటరన్‌ రహానే (27 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రహానేకు రుతురాజ్‌ (36 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) జతకలవడంతో సీఎస్‌కే 18.1 ఓవర్ల సునాయాసంగా లక్ష్యాన్ని (158) ఛేదించింది. 
 

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు