Breaking News

దెబ్బతిన్న పులిలా రొనాల్డో.. ఆ మెరుపులెక్కడ?

Published on Sat, 06/20/2026 - 08:43

రెండు దశాబ్దాలకు పైగా క్రిస్టియానో ​​రొనాల్డో ఫుట్‌బాల్‌ను ఏలుతున్నాడు. తనపై విమర్శలు వచ్చిన ప్రతీసారి అవి తప్పని నిరూపిస్తూ తన కెరీర్‌ను నిర్మించుకుంటూ వచ్చాడు ఈ పోర్చుగల్ స్టార్‌. విమర్శలు వచ్చిన ప్రతీసారి తన గోల్స్‌తో సమాధానమిచ్చాడు. అతని కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగుతుందా అనే సందేహాలు తలెత్తిన ప్రతిసారీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే వస్తున్నాడు. మాంచెస్టర్ నుంచి మాడ్రిడ్ వరకు, టురిన్ నుంచి రియాద్ వరకు, తన జాతీయ జట్టు పోర్చుగల్ తరఫున అసాధారణ కెరీర్‌తో రొనాల్డో పదేపదే అంచనాలను తిరగరాశాడు. ఒక్క ఫిఫా ప్రపంచకప్ సాధించలేదన్న వెలితి తప్ప మిగతా రికార్డులన్నీ రొనాల్డో ఎప్పుడో సాధించేశాడు.

ఇక అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఫిఫా ప్రపంచకప్‌లో మాత్రం రొనాల్డో అంచనాలు అందుకోలేకపోతున్నాడు. తన సమకాలీన ఆటగాళ్లైన మెస్సీ, ఎంబాపె, ఎర్లింగ్ హాలండ్, లామినే యమాలా, హ్యారీ కేన్‌ వంటి స్టార్లు తమ దేశాల తరఫున తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టి గోల్స్ కొట్టడంతో జట్టుకు విజయం అందించడంలో సహాయపడ్డారు. 

కానీ పోర్చుగల్ కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డో మాత్రం ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ తమ తొలి మ్యాచ్ కాంగోతో ఆడింది. ఈ మ్యాచ్‌లో 90 నిమిషాల పాటు మైదానంలో ఉన‍్న రొనాల్డో ఒక్క గోల్ కొట్టలేకపోయాడు. అంతేకాదు ఇతర ఆటగాళ్లకు కనీసం పాస్ కూడా అందించడంలో విఫలమయ్యాడు. దీంతో రొనాల్డో ఫామ్‌పై ప్రశ్నలు, విమర్శలు మొదలయ్యాయి.

ఆ ప్రశ్నలన్నింటికీ రొనాల్డో కూడా సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చేసింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న రొనాల్డో కాంగోతో మ్యాచ్‌లో కేవలం బంతిని 25సార్లు మాత్రమే టచ్ చేశాడు. ప్రతీ ఫిఫాతో పోల్చుకుంటే ఈసారి రొనాల్డో ప్రదర్శన అత్యల్పం. కేవలం మూడు సందర్భాల్లో మాత్రమే షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. 

మ్యాచ్‌లో మొత్తంగా 25 టచ్‌లు, రెండు ప్రోగ్రెసివ్ క్యారీ, రెండు ప్రోగ్రెసివ్ పాస్‌లు, రెండు ఏరియల్ డ్యూయల్స్ పాస్‌లు ఆడాడు. వయసు కూడా రొనాల్డోకు అడ్డంకిగా మారినట్లు అనిపిస్తోంది. తన కంటే వయసులో రెండేళ్లు చిన్నవాడైన మెస్సీ మాత్రం మైదానంలో పాదరసంలా కదులుతుంటే రొనాల్డో మాత్రం పరిగెత్తడానికి కూడా ఇబ్బంది పడినట్లు కాంగోతో మ్యాచ్‌లో కనిపించింది. 2006లో తొలి ఫిఫా ఆడిన సమయంలో రొనాల్డో వయసు 21 ఏళ్లు. 2026 నాటికి అతడి వయసు 41 ఏళ్లు. 

ఈ 20 ఏళ్లలో ఆరు ఫిఫా ప్రపంచకప్‌లు ఆడిన రొనాల్డో మొత్తంగా 8 గోల్స్ కొట్టాడు. రష్యా వేదికగా జరిగిన 2018 ఫిఫాలో రొనాల్డో అత్యధికంగా నాలుగు గోల్స్ కొట్టడం విశేషం. పోర్చుగల్ ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో రొనాల్డో 396 నిమిషాలు మైదానంలో గడిపాడు. కానీ ఆ జట్టు మాత్రం కేవలం ఒక్క గోల్ మాత్రమే చేయడం గమనార్హం. 

ఈ గణాంకాలు రొనాల్డో ఫామ్‌నే కాదు జట్టును కూడా ఇబ్బందుల్లోకి నెట్టేసినట్లుగా అనిపిస్తోంది. గతంలో తనపై విమర్శలు వచ్చిన ప్రతీసారి ఆటతోనే సమాధానం చెప్పిన రొనాల్డో మరోసారి అదే ఆటతో ప్రపంచం మొత్తం తనను ప్రశంసించేలా చేసుకోవాలని ఆశిద్దాం.

Read: ఫిఫా చ‌రిత్ర‌లోనే ఫాస్టెస్ట్‌ గోల్‌.. మొరాకోదే విజయం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)