Breaking News

చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో

Published on Wed, 10/15/2025 - 19:30

ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) (పోర్చుగల్‌) చరిత్ర సృష్టించాడు. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో (FIFA World Cup 2026 Qualifiers) అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా అవతరించాడు. హంగేరీతో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్‌ చేసిన అనంతరం ఈ ఘనత సాధించాడు. 

గతంలో ఈ రికార్డు గ్వాటెమాలా ఆటగాడు కార్లోస్ రుయిజ్‌ పేరిట ఉండేది. రూయిజ్‌ ఖాతాలో 39 గోల్స్‌ ఉండగా.. తాజా ప్రదర్శన అనంతరం రొనాల్డో గోల్స్‌ సంఖ్య 41కి చేరింది.

వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌ చరిత్రలో టాప్‌-5 గోల్‌ స్కోరర్లు..
రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్‌)- 41
కార్లోస్ రుయిజ్‌ (గ్వాటెమాలా)- 39
లియోనెల్ మెస్ (అర్జెంటీనా )- 36
అలీ దయీ (ఇరాన్)-‌ 35
లెవండోవ్స్కీ (పోలాండ్‌)- 33

కాగా, లిస్బన్‌ వేదికగా పోర్చుగల్‌, హంగేరి మధ్య జరిగిన మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసింది. పోర్చుగల్‌ తరఫున నమోదైన రెండు గోల్స్‌ రొనాల్డోనే చేశాడు. ఈ రెండు గోల్స్‌తో రొనాల్డో ఓవరాల్‌ గోల్స్‌ సంఖ్య 947కు చేరింది. ప్రత్యేకించి అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతని గోల్స్‌ సంఖ్య 143కు పెరిగింది. 40 ఏళ్ల వయసులో రొనాల్డో రేసు గుర్రంలా పరిగెడుతూ 1000 గోల్స్‌ దిశగా దూసుకెళ్తున్నాడు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న 2026 ఫిఫా వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో పోర్చుగల్‌ గ్రూప్‌-ఎఫ్‌ టాపర్‌గా కొనసాగుతోంది. న‌వంబ‌ర్ 14న ఐర్లాండ్‌తో జ‌రిగే మ్యాచ్‌లో గెలిస్తే, ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.

చదవండి: చెలరేగిన షమీ.. భారత సెలెక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్‌
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)