Breaking News

సడెన్‌ షాక్‌లిస్తున్న స్టార్‌ క్రికెటర్లు.. ఆందోళనలో అభిమానులు

Published on Tue, 06/10/2025 - 11:00

అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ ఏడాది అచొచ్చినట్లు లేదు. స్టార్‌ క్రికెటర్లు ఒక్కొరుగా రిటైర్మెంట్‌ ప్రకటిస్తూ క్రికెట్‌ అభిమానులకు సడెన్‌ షాక్‌లిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ మార్టిన్‌ గప్తిల్‌ తొలుత రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 

ఆతర్వాత టీమిండియా స్పీడ్‌స్టర్‌ వరుణ్‌ ఆరోన్‌, బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ దిగ్గజం తమీమ్‌ ఇక్బాల్‌, టీమిండియా వికెట్‌కీపర్‌ వృద్దిమాన్‌ సాహా, శ్రీలంక స్టార్‌ బ్యాటర్‌ దిముత్‌ కరుణరత్నే, బంగ్లాదేశీ స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ మహ్మదుల్లా రిటైర్మెంట్‌ ప్రకటించారు. 

కొద్ది రోజుల కిందట సౌతాఫ్రికా విధ్వంసకర యోధుడు హెన్రిచ్‌ క్లాసెన్‌ అనూహ్య పరిణామాల మధ్య రిటైర్మెంట్‌ ప్రకటించాడు. తాజాగా విండీస్‌ సిక్సర్ల వీరుడు నికోలస్‌ పూరన్‌ 29 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్‌ ప్రకటించి క్రికెట్‌ అభిమానులను షాక్‌కు గురి చేశాడు. పైన పేర్కొన్న ఆటగాళ్లంతా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు.

సడెన్‌ షాక్‌లు..
ఈ ఏడాది కొందరు క్రికెటర్లు సడెన్‌ షాక్‌లు ఇచ్చారు. మొదటి షాక్‌ ఆసీస్‌ దిగ్గజ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ ఇచ్చాడు. స్మిత్‌ వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆతర్వాత ఆసీస్‌ విధ్వంసకర వీరుడు మార్కస్‌ స్టోయినిస్‌ మరో షాక్‌ ఇచ్చాడు. స్టోయినిస్‌ వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. 

ఆతర్వాత బంగ్లాదేశ్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ వన్డే బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీం మరో షాక్‌ ఇచ్చాడు. అప్పటికే టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన రహీం వన్డేల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

క్రికెట్‌ దునియాకే భారీ షాక్‌..
ఈ ఏడాది క్రికెట్‌ అభిమానులకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి అతి పెద్ద షాక్‌లు ఇచ్చారు. వీరిద్దరు ఈ ఏడాది టెస్ట్‌ ఫార్మాట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించారు. రోహిత్‌, విరాట్‌ టెస్ట్‌ ఫార్మాట్‌ నుంచి వైదొలగడం భారత క్రికెట్‌కు భారీ లోటు. 

ఈ ఇద్దరు మరో భారత ఆటగాడు రవీంద్ర జడేజాతో కలిసి 2024 టీ20 వరల్డ్‌కప్‌ అనంతరం పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. రోహిత్‌, కోహ్లి టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించాక శ్రీలంక దిగ్గజ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ కూడా సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.

 

 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)