Breaking News

గుండె పగిలింది: టీమిండియా మాజీ క్రికెటర్‌ భావోద్వేగం

Published on Sat, 10/05/2024 - 17:19

టీమిండియా మాజీ క్రికెటర్‌ సలీల్‌ అంకోలా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతడి తల్లి మాలా అశోక్‌ అంకోలా(77) అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. పుణెలోని తన ఫ్లాట్‌లో గొంతు కోసి ఉన్న స్థితిలో శవమై కనిపించారు.

మానసిక సమస్యలతో సతమతం
ఈ నేపథ్యంలో ఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు ఇరుగుపొరుగు వారిని ఆరా తీశారు. అనంతరం డీఎస్‌పీ సందీప్‌ సింగ్‌ గిల్‌ మాట్లాడుతూ.. ‘‘మాలా ఇంట్లో పనిచేసే వ్యక్తి ఫ్లాట్‌కి వచ్చి డోర్‌ కొట్టగా ఎవరూ తలుపుతీయలేదు. దీంతో సమీపంలో నివసించే బంధువులకు సమాచారం ఇచ్చింది.

తలుపు తెరిచి చూడగా మాలా విగతజీవిగా కనిపించారు. ఆమె గొంతు కోసి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ గాయాలు తనకు తాను గానే చేసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నాం’’ అని తెలిపారు. 

కాగా మాలా అశోక్‌ అంకోలా గత కొన్నిరోజులుగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు గిల్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. దీంతో తనకు తానుగానే గాయపరచుకున్నారా అన్న కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు. 

అమ్మా.. హృదయం ముక్కలైంది
కాగా సలీల్‌ అంకోలా అంతర్జాతీయ క్రికెట్‌లో 1989- 1997 మధ్య భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఒక టెస్టు, 20 వన్డేలు ఆడాడు. అనంతరం ఈ ఫాస్ట్‌బౌలర్‌ పలు హిందీ సినిమాలతో పాటు టీవీ షోలలో నటించాడు. కాగా తల్లి మరణాన్ని ధ్రువీకరిస్తూ.. ‘అమ్మా’ అంటూ గుండె పగిలినట్లుగా ఉన్న ఎమోజీతో ఆమె ఫొటోను సలీల్‌ అంకోలా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

 

#

Tags : 1

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు