Breaking News

2026 ఏషియన్‌ గేమ్స్‌లో క్రికెట్‌.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఒలింపిక్‌ కమిటీ

Published on Wed, 04/30/2025 - 13:33

వచ్చే ఏడాది జపాన్‌లో జరుగనున్న 20వ ఆసియా క్రీడల్లో క్రికెట్‌ చేరికకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఆర్గనైజింగ్‌ కమిటీతో భేటి అనంతరం ఒలింపిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆసియా ఈ విషయాన్ని వెల్లడించింది. తదుపరి ఆసియా క్రీడల్లో క్రికెట్‌తో పాటు మిక్సడ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడకు కూడా అప్రూవల్‌ లభించింది. క్రితం ఆసియా క్రీడల్లో (2022 హాంగ్‌ఝౌ గేమ్స్‌, చైనా) లాగానే ఈసారి కూడా పురుషులు, మహిళల విభాగాల్లో క్రికెట్‌ పోటీలు జరుగుతాయి. టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 14 పురుష జట్లు, 9 మహిళల టీమ్స్‌ పాల్గొంటాయి.

గత ఆసియా క్రీడల్లో టీమిండియా పురుషులు, మహిళల విభాగాల్లో గోల్డ్‌ మెడల్స్‌ సాధించింది. ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను తొలిసారి 2010లో పరిచయం చేశారు. ఆతర్వాత కేవలం రెండు సార్లు (2014, 2022) మాత్రమే ఆసియా క్రీడల్లో క్రికెట్‌కు అనుమతి లభించింది. 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంతో తదుపరి ఆసియా క్రీడల్లో కూడా క్రికెట్‌ నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

1900 (పారిస్‌ ఒలింపిక్స్‌) తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం ఇదే మొదటిసారి. కేవలం రెండు క్రికెట్‌ జట్లు పాల్గొన్న ఆ ఒలింపిక్స్‌లో ఫ్రాన్స్‌పై గ్రేట్‌ బ్రిటన్‌ 158 పరుగుల తేడాతో విజయం సాధించి గోల్డ్‌ మెడల్‌ గెలుచుకుంది. 

2026 ఆసియా క్రీడలు సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు జరుగుతాయి. పురుషులు, మహిళల విభాగాల్లో భారత్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతుంది.  గత ఆసియా క్రీడల్లో రుతురాజ్‌ గైక్వాడ్‌ నేతృత్వంలోని భారత పురుషుల టీమ్‌ అత్యధిక సీడింగ్‌ (పాయింట్లు) ఆధారంగా గోల్డ్‌ మెడల్‌ గెల్చుకోగా.. హర్మన్‌ నేతృత్వంలోని భారత మహిళల టీమ్‌ ఫైనల్లో శ్రీలంకపై 19 పరుగుల తేడాతో విజయం సాధించి పసిడి పతకం​ కైవసం చేసుకుంది. 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)