Breaking News

టీమిండియాను అవమానించిన పోర్చుగల్ క్రికెట్‌

Published on Sat, 07/11/2026 - 18:02

టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో ఓ భారత అభిమానికి పోర్చుగల్ క్రికెట్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఇటీవల టీమిండియా ఐర్లాండ్ చేతిలో ఓడిన విషయాన్ని ప్రస్తావిస్తూ పోర్చుగల్ క్రికెట్‌ చేసిన కామెంట్‌  క్రికెట్ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.

పోర్చుగల్ క్రికెట్‌ జట్టు తమ చివరి 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కేవలం రెండు పరాజయాలు మాత్రమే చవిచూసిందంటూ క్రికెట్‌ పోర్చుగల్‌ సోషల్‌మీడియాలో ఓ పోస్టు షేర్ చేసింది. దీనిపై స్పందించిన ఓ భారత అభిమాని, "ఈ పోర్చుగల్ అకౌంట్ ఐర్లాండ్ నుంచి నడుస్తున్నట్టుంది" అంటూ కామెంట్‌ చేశాడు.

దీనిపై పోర్చుగల్ క్రికెట్ స్పందిస్తూ, "ఐర్లాండ్ గురించి నిజంగానే మాట్లాడాలనుకుంటున్నావా..?" అంటూ ఒక్క వాక్యంతోనే కౌంటర్ ఇచ్చాడు. ఈ వ్యాఖ్య భారత జట్టు ఇటీవల ఐర్లాండ్ చేతిలో ఎదుర్కొన్న టీ20 సిరీస్ పరాజయాన్ని ఉద్దేశించిందని అభిమానులు భావిస్తున్నారు. ఆ సమాధానం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతుంది.

టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత యూరప్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు, డబ్లిన్‌లో జరిగిన రెండు టీ20ల్లో ఐర్లాండ్ చేతిలో ఓడి చరిత్రలో తొలిసారి ఆ జట్టు చేతిలో టీ20 సిరీస్‌ కోల్పోయింది. అనంతరం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, ఆతర్వాతి మూడు మ్యాచ్‌ల్లో భారత్ వరుసగా పరాజయాలు చవిచూసి, ఇప్పటికే 0-3తో సిరీస్‌ కోల్పోయింది. ఈ సిరీస్‌లో నామమాత్రను చివరి టీ20 ఇవాళ జరుగునుంది.

శ్రేయస్‌ అయ్యర్‌ టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ గెలవలేదు. ఈ నేపథ్యంలో శ్రేయస్‌ భారీ ప్రెషర్‌ను ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి తరుణంలో క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న పోర్చుగల్‌ లాంటి దేశం టీమిండియాకు కౌంటరివ్వడం గమనార్హం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)