Breaking News

ఆస్ట్రేలియా టీ20 జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి పిలుపు

Published on Thu, 06/05/2025 - 10:00

వచ్చే నెలలో వెస్టిండీస్‌లో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 16 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (జూన్‌ 4) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా మిచెల్‌ మార్ష్‌ వ్యవహరించనున్నాడు. గత సీజన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ ఫైనల్లో 39 బంతుల్లోనే శతక్కొట్టిన విధ్వంసకర బ్యాటర్‌ మిచెల్‌ ఓవెన్‌ తొలిసారి జాతీయ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

ఓవెన్‌తో పాటు బౌలర్‌ మ్యాట్‌ కుహ్నేమన్‌కు కూడా తొలిసారి ఆసీస్‌ టీ20 జట్టు నుంచి పిలుపు అందింది. ఈ జట్టులో మరో విధ్వంసకర ఆటగాడు జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌కు చోటు దక్కలేదు. పేలవ ఫామ్‌ కారణంగా మెక్‌గుర్క్‌పై వేటు పడినట్లు తెలుస్తుంది. 

ఐపీఎల్‌ 2025 ఫైనలిస్ట్‌ పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో సభ్యులైన మార్కస్‌ స్టోయినిస్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. తాజాగా వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన మ్యాక్స్‌వెల్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్‌ 2025 ఛాంపియన్‌ జట్టులో (ఆర్సీబీ) సభ్యుడైన టిమ్‌ డేవిడ్‌ కూడా ఈ జట్టులో చోటు సంపాదించాడు. 

ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు కెమరూన్‌ గ్రీన్‌, కూపర్‌ కన్నోలీ టీ20 జట్టులోకి పునరాగమనం చేశారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలబెట్టడంతో కీలకంగా వ్యవహరించిన జోష్‌ హాజిల్‌వుడ్‌ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌ కోసం రెగ్యులర్‌ ఆటగాళ్లు పాట్‌ కమిన్స్‌, ట్రవిస్‌ హెడ్‌, మిచెల్‌ స్టార్క్‌కు విశ్రాంతినిచ్చారు.

విండీస్‌తో టీ20 సిరీస్‌ జులై 19న మొదలు కానుంది. 19, 22, 24, 25, 27 తేదీల్లో ఐదు టీ20లు జరుగనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌లు జమైకాలో జరుగనుండగా.. ఆఖరి మూడింటికి సెయింట్‌ కిట్స్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ సిరీస్‌కు ముందు ఆసీస్‌ విండీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కూడా ఆడనుంది. జూన్‌ 25, జులై 3, జులై 12 తేదీల్లో ఈ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. టెస్ట్‌, టీ20 సిరీస్‌ల కోసం ఆసీస్‌ వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఆసీస్‌ టెస్ట్‌ జట్టును ఇదివరకే ప్రకటించారు.  

విండీస్‌తో టీ20 సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్‌), సీన్ అబాట్, కూపర్ కన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కెమరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాట్ కుహ్నెమన్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచ్ ఓవెన్, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా

విండీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), ట్రవిస్‌ హెడ్‌, ఉస్మాన్‌ ఖ్వాజా, మార్నస్‌ లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, కెమరూన్‌ గ్రీన్‌, సామ్‌ కొన్‌స్టాస్‌, బ్యూ వెబ్‌స్టర్‌, అలెక్స్‌ క్యారీ, జోష్‌ ఇంగ్లిస్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, స్కాట్‌ బోలాండ్‌, నాథన్‌ లియోన్‌, మ్యాట్‌ కుహ్నేమన్‌, మిచెల్‌ స్టార్క్‌

 

 

 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు