చప్పగా ప్రారంభమైన విండీస్‌ క్రికెట్‌ పండగ.. విధ్వంసకర వీరులున్నా మెరుపుల్లేవు..!

Published on Fri, 08/15/2025 - 11:48

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 ఎడిషన్‌ భారతకాలమానం ప్రకారం ఇవాళ (ఆగస్ట్‌ 15) తెల్లవారు జామున ప్రారంభమైంది. ఆరంభ మ్యాచ్‌లో ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఫాల్కన్స్‌, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ ఎలాంటి మెరుపులు లేకుండా చప్పగా సాగింది. ఇరు జట్లలో విధ్వంసకర బ్యాటర్లున్నా ఒక్కరూ బ్యాట్‌ను ఝులిపించలేదు. బౌలర్ల ఆధిపత్యం నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో పేట్రియాట్స్‌పై ఫాల్కన్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఫాల్కన్స్‌.. వకార్‌ సలాంఖిల్‌ (4-0-22-4), నసీం షా (3.1-0-20-2), ఫజల్‌ హక్‌ ఫారూకీ (4-0-30-2), కైల్‌ మేయర్స్‌ (2-0-12-1) ధాటికి 17.1 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది. ఫాల్కన్స్‌ ఇన్నింగ్స్‌లో కరీమా గోరె (61) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇతను కూడా రాణించకపోయుంటే ఫాల్కన్స్‌ 100 పరుగుల లోపే ఆలౌటయ్యేది.

ఫాల్కన్స్‌ జట్టులో రకీమ్‌ కార్న్‌వాల్‌, బెవాన్‌ జాకబ్స్‌, ఫేబియన్‌ అలెన్‌, షకీబ్‌ అల్‌ హసన్‌ లాంటి విధ్వంసకర బ్యాటర్లున్నా ఒక్కరూ బ్యాట్‌ ఝులిపించలేకపోయారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పేట్రియాట్స్‌ 15 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పేట్రియాట్స్‌ బ్యాటర్లు తలో చేయి వేసి తమ జట్టును గెలిపించుకున్నారు. ఎవిన్‌ లూయిస్‌ 25, ఆండ్రీ ఫ్లెచర్‌ 19, కైల్‌ మేయర్స్‌ 15, అలిక్‌ అధనాజ్‌ 37 నాటౌట్‌, జేసన్‌ హోల్డర్‌ 18 నాటౌట్‌ పరుగులు చేశారు. 

విధ్వంసకర బ్యాటర్‌ రిలీ రొస్సో డకౌటై నిరాశపరిచాడు. ఈ జట్టులో కూడా అందరూ మెరుపు వీరులే ఉన్నా ఒక్కరు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఫాల్కన్స్‌ బౌలర్లలో కార్న్‌వాల్‌ 2, ఘజన్‌ఫర్‌, మెక్‌కాయ్‌ తలో వికెట్‌ తీశారు. 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)