Breaking News

CPL 2025:​ ప్రపంచ ప్రమాదకర బ్యాటర్లంతా ఒకే జట్టులో.. బౌలర్లకు దబిడిదిబిడే..!

Published on Thu, 06/19/2025 - 13:02

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 ఎడిషన్‌ డ్రాఫ్ట్‌ (వేలం) జూన్‌ 18న జరిగింది. ఇందులో ప్రపంచవాప్తంగా ఉన్న చాలామంది స్టార్‌ ప్లేయర్లు పాల్గొన్నారు. ఆరు ఫ్రాంచైజీలు (ఆంటిగ్వా & బార్బుడా ఫాల్కన్స్, బార్బడోస్ రాయల్స్, గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్, సెయింట్ లూసియా కింగ్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్) తమకు నచ్చిన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి.

డ్రాఫ్ట్‌కు ముందే పలువురు హై ప్రొఫైల్‌ ఆటగాళ్లు ఫ్రాంచైజీలు మారారు. ప్రీ డ్రాఫ్ట్‌ పిక్స్‌లో భాగంగా జేసన్‌ హోల్డర్‌, అలిక్‌ అథనాజ్‌ బార్బడోస్‌ రాయల్స్‌ నుంచి సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌కు తరలి వెళ్లారు. షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ బదులుగా ఈ వర్తకం జరిగింది. ఇలాంటి మార్పులు డ్రాఫ్ట్‌లో చాలా చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది డ్రాఫ్ట్‌లో ఓ కొత్త డెవలెప్‌మెంట్‌ చోటు చేసుకుంది. డ్రాఫ్ట్ చివరి మూడు రౌండ్లలో వెస్టిండీస్ బ్రేక్అవుట్ లీగ్‌లో (లోకల్‌ లీగ్‌) పాల్గొన్న ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి.

డ్రాఫ్ట్‌ ముగిసిన అనంతరం అన్ని ఫ్రాంచైజీలు తమతమ జట్లను ప్రకటించాయి. అన్ని జట్లను పరిశీలించాక ఓ ఆసక్తికర విషయం బయటపడింది. ప్రపంచంలోని అతి ప్రమాదకర బ్యాటర్లంతా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టులో ఉన్నారు. ఈ ఫ్రాంచైజీ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కేకేఆర్‌కు సిస్టర్‌ ఫ్రాంచైజీ. ఇందులో కీరన్‌ పోలార్డ్‌, నికోలస్‌ పూరన్‌, ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌, అలెక్స్‌ హేల్స్‌, కొలిన్‌ మున్రో లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. వీరిని చూస్తే ప్రపంచంలో ఎంతటి గొప్ప బౌలర్‌కు అయిన వణుకు పట్టాల్సిందే.

సీపీఎల్‌ 2025 డ్రాఫ్ట్‌ అనంతరం పూర్తి జట్లు ఇలా ఉన్నాయి..

ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ : కీరాన్ పొలార్డ్ , ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, నికోలస్ పూరన్, అలెక్స్ హేల్స్, అకేల్ హోసేన్, మహ్మద్ అమీర్, కాలిన్ మున్రో, ఉస్మాన్ తారిక్, అలీ ఖాన్, డారెన్ బ్రావో, యానిక్ కరియా, కీసీ కార్టీ, టెర్రెన్స్ హిండ్స్, మెక్కెన్నీ క్లార్క్, జాషువా డా సిల్వా, నాథన్ ఎడ్వర్డ్

సెయింట్ లూసియా కింగ్స్ : టిమ్ డేవిడ్, అల్జరి జోసెఫ్, జాన్సన్ చార్లెస్, టిమ్ సీఫెర్ట్, రోస్టన్ చేజ్, తబ్రైజ్ షంసి, డేవిడ్ వైస్, డెలానో పోట్గీటర్, మాథ్యూ ఫోర్డ్, ఆరోన్ జోన్స్, ఖారీ పియరీ, జావెల్లె గ్లెన్, మికా మెకెంజీ, షడ్రక్ డెస్కార్టే, జోహన్ జెరెమియా, కియోన్ గాస్టన్, అకీమ్ అగస్టే

గయానా అమెజాన్ వారియర్స్: ఇమ్రాన్ తాహిర్, షిమ్రాన్ హెట్మెయర్, రొమారియో షెపర్డ్, షాయ్ హోప్, గ్లెన్ ఫిలిప్స్, గుడాకేష్ మోటీ, మోయిన్ అలీ, షమర్ జోసెఫ్, కీమో పాల్, డ్వైన్ ప్రిటోరియస్, షమర్ బ్రూక్స్, కెమోల్ సావరీ, హసన్ ఖాన్, జెడియా బ్లేడ్స్‌, కెవ్లాన్‌ ఆండర్సన్, క్విన్టిన్‌ సాంప్సన్‌, రియాద్‌ లతీఫ్‌

బార్బడోస్ రాయల్స్ : రోవ్‌మన్ పావెల్, బ్రాండన్ కింగ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, క్వింటన్ డి కాక్, ముజీబ్ ఉర్ రెహమాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, జోమెల్ వారికన్, కదీమ్ అలీన్, షక్కెరె ప్యారిస్, కోఫీ జేమ్స్, నైమ్ యంగ్, రివాల్డో క్లార్క్, జీషన్‌ మొటారా, జోహన్‌ లేన్‌, రామోన్‌ సిమ్మండ్స్‌

ఆంటిగ్వా & బార్బుడా ఫాల్కన్స్ : ఇమాద్ వసీం, షకీబ్ అల్ హసన్, ఫాబియన్ అల్లెన్, నవీన్-ఉల్-హక్, ఒబెద్ మెక్‌కాయ్, జస్టిన్ గ్రీవ్స్, బెవాన్ జాకబ్స్, జేడెన్ సీల్స్, అల్లా గజాన్‌ఫర్, రహకీమ్ కార్న్‌వాల్, ఓడియన్ స్మిత్, జ్యువెల్ ఆండ్రూ, షమర్ స్ప్రింగర్, అమీర్ జాంగూ, కరీమా గోర్, కెవిన్ విఖం, జాషువా జేమ్స్

సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్ : కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్, రిలీ రోసౌవ్, ఎవిన్ లూయిస్, ఫజల్హాక్ ఫరూకీ, కార్బిన్ బాష్, వకార్ సలామ్‌ఖైల్, ఆండ్రీ ఫ్లెచర్, అలిక్ అథనాజ్, మొహమ్మద్ నవాజ్, డొమినిక్ డ్రేక్స్, మిఖైల్‌ లూయిస్, అష్మద్‌ నెడ్‌, జెర్మియా లూయిస్‌, జైడ్‌ గూలీ, నవీన్‌ బిడైసీ, లెనికో బౌచర్

కాగా, ఈ ఏడాది కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అగస్ట్‌ 14 నుంచి సెప్టెంబర్‌ 21 వరకు జరుగుతుంది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)