Breaking News

8 బంతుల్లో 7 సిక్సర్లు.. పోలార్డ్‌ ఊచకోత

Published on Tue, 09/02/2025 - 08:32

విండీస్‌ టీ20 దిగ్గజం కీరన్‌ పోలార్డ్‌ 38 ఏళ్ల వయసులోనూ వీర లెవెల్లో రెచ్చిపోతున్నాడు. ప్రస్తుతం కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ఆడుతున్న ఈ భారీకాయుడు విధ్వంసం సృష్టించడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ లీగ్‌ ప్రారంభం నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న పోలీ.. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో (సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌పై) ఉగ్రరూపం ప్రదర్శించాడు.

ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తుండగా.. అప్పటివరకు నిదానంగా (13 బంతుల్లో 12 పరుగులు) ఆడిన పోలార్డ్‌ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. 8 బంతుల్లో ఏకంగా 7 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 15వ ఓవర్‌ మూడో బంతికి మొదలైన పోలీ విధ్వంసకాండ ఆతర్వాతి ఓవర్‌ అంతా సాగింది.

తొలుత నేవియన్‌ బిదైసీ బౌలింగ్‌లో 3, 4, 6 బంతులను సిక్సర్లుగా మలిచిన పోలార్డ్‌.. వాకర్‌ సలాంఖిల్‌ వేసిన ఆతర్వాతి ఓవర్‌లో మరింత రెచ్చిపోయి వరుసగా 3 నుంచి 6 బంతులను స్టేడియం దాటించాడు. మధ్యలో ఒక్క బంతి మినహా పోలార్డ్‌ వరుసగా తానెదుర్కొన్న 8 బంతుల్లోనే ఏడింటిని (6,6,0,6,6,6,6,6) సిక్సర్లుగా మలిచాడు.

ఈ క్రమంలో పోలార్డ్‌ కేవలం 21 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఇన్నింగ్స్‌లో అతడు పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అలెక్స్‌ హేల్స్‌ను (14031) వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ విభాగంలో క్రిస్‌ గేల్‌ (14562) ఒక్కడే పోలార్డ్‌ (13070) కంటే ముందున్నాడు.

పేట్రియాట్స్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 29 బంతులు ఎదర్కొన్న పోలార్డ్‌ 2 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేశాడు. పోలార్డ్‌తో పాటు పూరన్‌ (38 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

అనంతరం 180 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పేట్రియాట్స్‌ ఆదిలో లక్ష్యం దిశగా సాగినా, ఆతర్వాత తడబడింది. నాథన​ ఎడ్వర్డ్స్‌ (3.2-0-30-3), మొహమ్మద్‌ ఆమిర్‌ (3.4-0-29-2) చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 12 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. ఈ గెలుపుతో (7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) నైట్‌రైడర్స్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.

Videos

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు