CPL 2023: జాన్సన్‌ చార్లెస్‌ ఊచకోత.. లూసియా కింగ్స్‌ ఘన విజయం

Published on Sun, 09/03/2023 - 15:37

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2023లో భాగంగా బార్బడోస్‌ రాయల్స్‌తో నిన్న (సెప్టెంబర్‌ 2) జరిగిన మ్యాచ్‌లో సెయింట్‌ లూసియా కింగ్స్‌ 90 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లూసియా కింగ్స్‌.. జాన్సన్‌ చార్లెస్‌ (52 బంతుల్లో 78; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్‌ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. జాన్సన్‌తో పాటు కొలిన్‌ మున్రో (33) ఓ మోస్తరుగా రాణించగా.. రోషన్‌ ప్రైమస్‌ (19), సికందర్‌ రజా (18), రోస్టన్‌ ఛేజ్‌ (11 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. బార్బడోస్‌ బౌలర్లలో వాన్‌ డర్‌ మెర్వ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. జేసన్‌ హోల్డర్‌ 2, ఓబెద్‌ మెక్‌కాయ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

196 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన బార్బడోస్‌.. అల్జరీ జోసఫ్‌ (2.3-0-7-3), పీటర్‌ హ్యాట్జోగ్లో (3-0-4-2), రోషన్‌ ప్రైమస్‌ (2-0-11-2), సికందర్‌ రజా (1/21), మాథ్యూ ఫోర్డ్‌ (1/28), ఖారీ పిమెర్‌ (1/28) ధాటికి 17.3 ఓవర్లలో 105 పరుగులకు చాపచుట్టేసింది. బార్బడోస్‌ ఇన్నింగ్స్‌లో న్యీమ్‌ యంగ్‌ (20), రకీమ్‌ కార్న్‌వాల్‌ (18), జేసన్‌ హోల్డర్‌ (18),  వాన్‌ డర్‌ మెర్వ్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

ఈ మ్యాచ్‌లో గెలుపుతో లూసియా కింగ్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. బార్బడోస్‌ ఆఖరి నుంచి రెండో స్థానానికి (ఐదో ప్లేస్‌) పడిపోయింది. పాయింట్ల పట్టికలో గయానా రెండో స్థానంలో ఉండగా.. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌, జమైకా తలైవాస్‌ 3, 4 స్థానాల్లో, సెయింట్‌ కిట్స్‌ పేట్రియాట్స్‌ ఆఖరి స్థానంలో నిలిచాయి.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)