Breaking News

రెండో టెస్ట్‌లోనే అరుదైన ఫీట్‌ సాధించిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌

Published on Tue, 07/01/2025 - 18:33

సౌతాఫ్రికా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కార్బిన్‌ బాష్‌ తన కెరీర్‌లో రెండో టెస్ట్‌లోనే అరుదైన ఫీట్‌ సాధించాడు. సెంచరీ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో సౌతాఫ్రికా ప్లేయర్‌గా, ఓవరాల్‌గా 40వ ఆల్‌రౌండర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బాష్‌కు ముందు (సౌతాఫ్రికా) జిమ్మీ సింక్లైర్‌ (106, 6/26), ఏ ఫాల్కనర్‌ (123. 5/120), జాక్‌ కల్లిస్‌ (110, 5/90), జాక్‌ కల్లిస్‌ (139 నాటౌట్‌, 5/21) ఈ ఘనత సాధించారు.

జింబాబ్వేతో తాజాగా ముగిసిన టెస్ట్‌ మ్యాచ్‌లో బాష్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో బాష్‌ తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ (100) చేసి రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన (5/43) నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో బాష్‌ సహా డ్రి ప్రిటోరియస్‌ (153), ముల్దర్‌ (4/50, 147), కేశవ్‌ మహారాజ్‌ (3/70, 51), కోడి యూసఫ్‌ (3/42, 3/ 22) సత్తా చాటడంతో జింబాబ్వేపై సౌతాఫ్రికా 328 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన తర్వాతి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా ఛాంపియన్‌లా ఆడి కొత్త టెస్ట్‌ సైకిల్‌ను (2025-27) ఘనంగా ప్రారంభించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న సౌతాఫ్రికా ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. అయినా ఛాంపియన్‌ ఆట ఆడి పసికూన జింబాబ్వేపై తమ పరాక్రమాన్ని చూపించింది. సీనియర్లు బవుమా, మార్క్రమ్‌, రబాడ లాంటి వారు ఈ సిరీస్‌ ఆడకుండా విశ్రాంతి తీసుకున్నారు.

ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడినప్పటికీ వారి స్థాయికి మించి పోరాటం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు సౌతాఫ్రికాకు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. సీన్‌ విలియమ్స్‌ (137) అద్బుతమైన సెంచరీతో జింబాబ్వేను గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్‌ నుంచి ఎవరి సహకారం​ లేకపోవడంతో అతని పోరాటం వృధా అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో జింబాబ్వే పూర్తిగా చేతులెత్తేసింది. 

భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అరంగేట్రం ఆటగాడు డ్రి ప్రిటోరియస్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో ప్రిటోరియస్‌తో పాటు డెవాల్డ్‌ బ్రెవిస్‌, కోడి యూసఫ్‌ అరంగేట్రం చేశారు. రెండో టెస్ట్‌ జులై 6 నుంచి బులవాయో వేదికగానే జరుగనుంది. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)