Breaking News

సౌతాఫ్రికాతో మూడో వన్డే.. చరిత్ర సృష్టించిన యువ బౌలర్‌

Published on Sun, 08/24/2025 - 20:51

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా యువ స్పిన్నర్‌ కూపర్‌ కన్నోలీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అతడు.. ఆసీస్‌ తరఫున ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. 

కన్నోలీ కేవలం 22 ఏళ్ల 2 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో కన్నోలీ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ క్రెయిగ్‌ మెక్‌డెర్మాట్‌, ప్రస్తుత స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌లను వెనక్కు నెట్టాడు.

మెక్‌డెర్మాట్‌ 22 ఏళ్ల 204 రోజుల వయసులో (1987) వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించగా.. స్టార్క్‌ 22 ఏళ్ల 211 రోజుల వయసులో (2012) ఈ ఘనత సాధించాడు. 

ఈ ఐదు వికెట్ల ప్రదర్శనలతో కన్నోలీ మరో రికార్డు కూడా సాధించాడు. మైఖేల్‌ క్లార్క్‌ తర్వాత ఆసీస్‌ తరఫున వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మైఖేల్‌ క్లార్క్‌ 2004లో శ్రీలంకతో జరిగిన వన్డేలో 35 పరుగులకు ఐదు వికెట్లు తీశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. కన్నోలీ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో ఆసీస్‌ సౌతాఫ్రికాను 276 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. 432 పరుగుల అతి భారీ లక్ష్య ఛేదనలో కన్నోలీతో పాటు (6-0-22-5), జేవియర్‌ బార్ట్‌లెట్‌ (6-0-45-2), సీన్‌ అబాట్‌ (4-0-27-2), ఆడమ్‌ జంపా (4.5-1-31-1) సత్తా చాటడంతో సౌతాఫ్రికా 155 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెవాల్డ్‌ బ్రెవిస్‌ (49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. ట్రవిస్‌ హెడ్‌ (142), మిచెల్‌ మార్ష్‌ (100), గ్రీన్‌ (118 నాటౌట్‌) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. అలెక్స్‌ క్యారీ (50 నాటౌట్‌) అర్ద సెంచరీతో రాణించాడు.

ఈ గెలుపుతో ఆసీస్‌ ఇదివరకే కోల్పోయిన సిరీస్‌లో సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్‌ 1-2 తేడాతో కైవసం చేసుకుంది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)