Breaking News

కంగ్రాట్స్ తిలక్‌.. అక్కడ కూడా దుమ్మురేపాలి: రాయుడు

Published on Thu, 07/06/2023 - 15:08

వెస్టిండీస్‌ టీ20 సిరీస్‌కు హైదారాబాద్‌ యువ ఆటగాడు తిలక్‌ వర్మ ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌ కోసం బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో తిలక్‌ వర్మకు చోటు దక్కింది. కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ.. ఐపీఎల్‌లో చెలరేగడంతో తిలక్ వర్మకు సెలెక్టర్లు పిలుపునిచ్చారు.

గత రెండు ఐపీఎల్‌ సీజన్‌లలో కూడా తిలక్‌ వర్మ అద్బుతమైన ప్రదర్శరన కనబరిచాడు.  గతేడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన తిలక్‌.. 36.09 సగటుతో 303 పరుగులు చేసి ముంబై తరఫున రెండో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్‌లో కూడా అతడు అదరగొట్టాడు. 11 మ్యాచ్‌ల్లో 42.87 సగటుతో 343 పరుగులు సాధించాడు. 

ఇక తొలిసారి భారత జట్టుకు ఎంపికైన తిలక్‌ వర్మకు టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు అభినందనలు తెలిపాడు. "భారత జట్టుకు ఎంపికైనందుకు హృదయపూర్వక అభినందనలు. ప్రతీ ఫార్మాట్‌లో టీమిండియా తరపున అద్భుతంగా రాణిస్తావని ఆశిస్తున్నాను. ఆల్‌ది బెస్ట్‌ తిలక్‌" అంటూ రాయుడు ట్వీట్‌ చేశాడు.

అదే విధంగా టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా తిలక్ వర్మ ఎంపికపై స్పందిచాడు. "తొలిసారి భారత టీ20 జట్టుకు ఎంపికైనందుకు అభినందనలు. తిలక్‌ జట్టులోకి రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నా. అతనితో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా" అని సూర్య ట్విటర్‌లో పేర్కొన్నాడు. 

విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), శుబ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్‌ కెప్టెన్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.


చదవండి: IND vs WI: అతడిని ఎందుకు సెలక్ట్‌ చేశారు.. ఏం చేశాడని! పాపం రుత్‌రాజ్‌

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)