Breaking News

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం

Published on Sun, 07/26/2026 - 16:28

గ్లాస్కో వేదిక‌గా జ‌రుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌-2026లో భార‌త్ ఖాతాలో రెండో ప‌త‌కం చేరింది. పురుషల వెయిట్‌లిఫ్టింగ్ 60 కేజీల విభాగంలో  భారత వెయిట్‌లిఫ్టర్ చనంబమ్ రిషికాంత్ సింగ్  రజత పతకం సాధించాడు. ఈ ఈవెంట్‌లో రిషికాంతకు ప్ర‌ధాన పోటీదారుడిగా నిలిచిన‌ మలేషియా అథ్లెట్ అనిక్ కస్దాన్‌కు గోల్డ్‌మెడ‌ల్ ద‌క్కింది.

కాగా తొలుత  స్నాచ్ విభాగంలో రిషికాంత, అనిక్ కస్దాన్‌లు ఇద్దరూ అత్యధికంగా 121 కేజీల బరువును ఎత్తి ఇద్దరూ అగ్రస్ధానంలో నిలిచారు. క్లీన్ అండ్ జెర్క్‌లో మాత్రం కస్దాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. రిషికాంత తన అత్యుత్తమ ప్రయత్నంలో 143 కేజీలు మాత్రమే ఎత్తగా, కస్దాన్ 152 కేజీల బరువును ఎత్తి అందరిని ఆశ్చర్యపరిచాడు. 

కస్దాన్ మొత్తం 273 కేజీల (121kg+152kg) బరువు ఎత్తి అగ్రస్ధానంలో నిలవగా..  రిషికాంత మొత్తం 264 కేజీల (121kg+143kg) రెండో స్ధానంలో నిలిచాడు.  కెన్యాకు చెందిన జోషువా అముంగా మబోయా 260 కేజీల మొత్తం స్కోరుతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.
 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)