Breaking News

ఒళ్లు మండిన గాఫ్‌.. బదులు తీర్చుకుంటానని హెచ్చరిక!

Published on Fri, 07/10/2026 - 16:37

ప్ర‌తిష్టాత్మ‌క వింబుల్డ‌న్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మ‌హిళ‌ల సింగిల్స్‌లో అమెరికా స్టార్ కోకో గాఫ్ ప్ర‌యాణం సెమీస్‌లోనే ముగిసింది. గురువారం జ‌రిగిన సింగిల్స్ క్వార్ట‌ర్స్‌లో చెక్ రిప‌బ్లిక్‌కు చెందిన ముచోవా 6-2, 1-6, 7-6 (12/10)తో గాఫ్‌పై విజ‌యాన్ని అందుకొని ఫైన‌ల్లో ప్ర‌వేశించింది. అయితే మ్యాచ్ ఓట‌మి త‌ర్వాత గాఫ్‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 

వింబుల్డ‌న్‌లో సెమీస్‌లో నిష్క్ర‌మించ‌డంపై కొంత‌మంది ప‌నిగ‌ట్టుకొని ఆమెను హేళ‌న చేస్తూ అస‌భ్య‌క‌ర కామెంట్లు పెట్టారు. అప్ప‌టికే ఓట‌మి బాధ‌లో ఉన్న 22 ఏళ్ల గాఫ్‌కు కొంత‌మంది పెట్టిన కామెంట్లకు ఒళ్లు మండిపోయింది. దీంతో త‌న‌ను ఎవ‌రైతే విమ‌ర్శించారో వారికి త‌న‌దైన శైలిలో ఘాటుగా స‌మాధాన‌మిచ్చింది. 

'కొంత‌మంది నాపై విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో పాటు సందేశాలు పంపించారు. ఏం ప‌ర్వాలేదు. ఇలాంటి విమ‌ర్శ‌లు, ట్రోల్స్ మ‌న‌ల్ని మ‌రింత బ‌లంగా ఫుంజుకోవ‌డానికి ప్రేరేపిస్తాయి. ఈసారి వింబుల్డ‌న్‌లో నేనే ఓడిపోయి ఉండొచ్చు. కానీ త‌ర్వాతి ఏడాది గెలిచి న‌న్ను విమ‌ర్శించిన వారికి నా విజ‌యాన్ని ట్యాగ్ చేసి గ‌ట్టి స‌మాధానం ఇవ్వాల‌నుకుంటున్నా' అని గాఫ్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో పేర్కొంది. 

ఇక కోకో గాఫ్ తన కెరీర్‌లో 2023 యూఎస్ ఓపెన్‌తో పాటు 2025 ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను కైవ‌సం చేసుకుంది. ఈసారి వింబుల్డ‌న్ గ్రాండ్‌స్లామ్‌తో మూడో టైటిల్ ఖాతాలో వేసుకుంటుంద‌ని ఆశించిన‌ప్ప‌టికీ కోకో గాఫ్ సెమీస్‌కు ప‌రిమిత‌మైంది.

Read: నేపాల్‌తో చారిత్రక క్రికెట్‌ సిరీస్‌.. వైభవ్‌కు ప్రమోషన్‌!

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)