Breaking News

Basket Ball: 7 అడుగుల 5 అంగుళాల ఆజానుబాహురాలు.. ఎంత అలవోకగా పాయింట్లు సాధిస్తుందో చూడండి..!

Published on Wed, 06/26/2024 - 10:14

మహిళల బాస్కెట్‌బాల్‌లో 17 ఏళ్ల చైనా అమ్మాయి ఝాంగ్‌ జియు సంచలనాలు సృష్టిస్తుంది . 7 అడుగుల 5 అంగుళాల ఆజానుబాహురాలైన జియు తన హైట్‌ను అడ్వాంటేజ్‌గా తీసుకుని అలవోకగా పాయింట్లు సాధిస్తూ టాక్‌ ఆఫ్‌ ద సోషల్‌మీడియాగా మారింది. జియు తన ఎత్తు కారణంగా దూరం నుంచి ఖచ్చితత్వంగా డైరెక్ట్‌ షూట్‌లు చేయడంతో పాటు దుర్భేద్యమైన డిఫెన్స్‌ను ప్రదర్శించగలుగుతుంది.  

అంతర్జాతీయ కెరీర్‌లో తన తొలి టోర్నమెంట్‌ (FIBA అండర్‌ 18 మహిళల ఆసియా కప్‌ 2024) ఆడుతున్న జియు.. తాజాగా ఇండొనేషియాతో జరిగిన మ్యాచ్‌లో 19 పాయింట్లు సాధించి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. జియు కేవలం 13 నిమిషాల వ్యవధిలో 9 షూట్‌లను పాయింట్లుగా మలిచింది. ఈ గేమ్‌లో చైనా 109-50 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌ అనంతరం ఇంటర్నేషనల్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ (FIBA) జియు సాధించిన పాయింట్లకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతుంది. జియు చెమటోడ్చకుండా పాయింట్లు సాధిస్తుందని కొందరంటుంటే.. మరికొందరు జియుని చీట్‌ కోడ్‌ అని అంటున్నారు. మొత్తాని​​​కి జియు బాస్కెట్‌బాల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)