చైనా ‘డబుల్‌’ ధమాకా... థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ టైటిల్స్‌ సొంతం..

Published on Mon, 05/06/2024 - 08:33

ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తమకు తిరుగులేదని చైనా జట్లు మరోసారి చాటుకున్నాయి. థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ టీమ్‌ టోర్నమెంట్‌లో విజేతగా అవతరించాయి. సొంతగడ్డపై ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో చైనా మహిళల జట్టు ఉబెర్‌ కప్‌ను 16వ సారి... చైనా పురుషుల జట్టు థామస్‌ కప్‌ను 11వ సారి సొంతం చేసుకున్నాయి.

ఇండోనేసియాతో జరిగిన ఉబెర్‌ కప్‌ టైటిల్‌ పోరులో చైనా 3–0తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో చెన్‌ యు ఫె 21–7, 21–16తో మరిస్కాపై... రెండో మ్యాచ్‌లో చెన్‌ కింగ్‌ చెన్‌–జియా యి ఫాన్‌ 21–11, 21–8తో సితి ఫాదియా–రిబ్కా సుగియార్తోలపై... మూడో మ్యాచ్‌లో హి బింగ్‌ జియావో 10–21, 21–15, 21–17తో ఎస్తెర్‌పై గెలిచారు. థామస్‌ కప్‌ ఫైనల్లో చైనా 3–1తో ఇండోనేసియాను ఓడించింది.

తొలి మ్యాచ్‌లో షి యు కి 21–17, 21–6 తో జిన్‌టింగ్‌పై, రెండో మ్యాచ్‌లో లియాంగ్‌ –వాంగ్‌ చాంగ్‌ 21–18, 17–21, 21–17తో ఫజర్‌–అర్దియాంతోలపై నెగ్గడంతో చైనా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌లో జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా) 21–16, 15–21, 21–17తో లీ షి ఫెంగ్‌ను ఓడించాడు. నాలుగో మ్యాచ్‌లో హి జి టింగ్‌–జియాంగ్‌  21–11, 21–15తో ఫిక్రి–మౌలానాలపై నెగ్గి చైనాకు 3–1తో టైటిల్‌ను ఖరారు చేశారు.

ఇవి చదవండి: స్టార్ రెజ్లర్ బజరంగ్ పై.. తాత్కాలిక నిషేధం!

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)