Breaking News

65వ సెంచరీ నమోదు చేసిన పుజారా

Published on Sun, 05/26/2024 - 15:19

ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో టీమిండియా టెస్ట్‌ బ్యాటర్‌ ఛతేశ్వర్‌ పుజారా చెలరేగిపోతున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ ప్రస్తుత సీజన్‌లో ససెక్స్‌ తరఫున రెండో సెంచరీ సాధించిన పుజారా.. ఓవరాల్‌గా 65వ ఫస్ట్‌ క్లాస్‌ సెంచరీ నమోదు చేశాడు. ససెక్స్‌ తరఫున కౌంటీల్లో పుజారాకు ఇది 10వ శతకం. కౌంటీ ఛాంపియన్‌షిన్‌ డివిజన్‌-2లో భాగంగా ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానం వేదికగా మిడిల్‌సెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా ఈ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పుజారా తనదైన శైలిలో అడ్డుగోడ పాత్ర పోషించి 302 బంతుల్లో 15 బౌండరీల సాయంతో 129 పరుగులు చేసి ఔటయ్యాడు.

పుజారాతో పాటు కెప్టెన్‌ జాన్‌ సింప్సన్‌ (167) శతక్కొట్టడంతో ససెక్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 554 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ససెక్స్‌ ఇన్నింగ్స్‌లో టామ్‌ హెయిన్స్‌ (40), డానీ లాంబ్‌ (49) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిడిల్‌సెక్స్‌ బౌలర్లలో బాంబర్‌ 3, బ్రూక్స్‌, హోల్‌మన్‌ తలో 2, ర్యాన్‌ హిగ్గిన్స్‌, నాథన్‌ ఫెర్నాండెజ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మిడిల్‌సెక్స్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట​్‌ నష్టానికి 62 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సామ్‌ రాబ్సన్‌ (40), మ్యాక్స్‌ హోల్డన్‌ (18) క్రీజ్‌లో ఉండగా.. మార్క్‌ స్టోన్‌మన్‌ (4) ఔటయ్యాడు. ప్రస్తుతం మిడిల్‌సెక్స్‌ ససెక్స్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 492 పరుగులు వెనకపడి ఉంది. 
 

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)