Breaking News

నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లు వారే: ఛతేశ్వర్‌ పుజారా

Published on Mon, 08/25/2025 - 12:57

టీమిండియా టెస్టు స్పెషలిస్టుగా సేవలు అందించిన ఛతేశ్వర్‌ పుజారా (Cheteshwar Pujara) ఆటకు అల్విదా చెప్పాడు. 2010 నుంచి 2023 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఈ సౌరాష్ట్ర బ్యాటర్‌.. తన కెరీర్‌లో 103 టెస్టులు ఆడాడు. మొత్తంగా 16217 బంతులు ఎదుర్కొని 7195 పరుగులు సాధించాడు.

ఇందులో పందొమ్మిది శతకాలు, మూడు డబుల్‌ సెంచరీలు, 35 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక తన కెరీర్‌లో కేవలం ఐదు వన్డేలే ఆడిన పుజారా.. 51 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) వారసుడిగా, ‘నయా వాల్‌’ ప్రసిద్ధి పొందిన పుజారా.. విదేశీ గడ్డపై ముఖ్యంగా SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో ఉత్తమంగా రాణించాడు.

ఆ నలుగురు.. టఫెస్ట్‌
ఈ నేపథ్యంలో పుజారా తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ల గురించి తాజాగా వెల్లడించాడు. సౌతాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌, మోర్నీ మోర్కెల్‌ బౌలింగ్‌లో తాను పరుగులు రాబట్టేందుకు ఇబ్బందిపడేవాడినని తెలిపాడు. అదే విధంగా.. ఇంగ్లండ్‌ పేస్‌ లెజెండ్‌ జేమ్స్‌ ఆండర్సన్‌, ఆస్ట్రేలియా టెస్టు సారథి ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins)ను ఎదుర్కోవడం కష్టమని పుజ్జీ పేర్కొన్నాడు.

వారి బౌలింగ్‌లో పుజ్జీ బ్యాటింగ్‌ సగటు ఇలా
కాగా సౌతాఫ్రికాతో 17 టెస్టులు ఆడిన పుజారా సగటు కేవలం 30.41. స్టెయిన్‌ బౌలింగ్‌లో అతడి బ్యాటింగ్‌ సగటు 30. అదే విధంగా.. మోర్కెల్‌ బౌలింగ్‌లో 19. ఈ ఇద్దరు పుజారాను చెరో ఆరుసార్లు అవుట్‌ చేశారు.

ఇక ఆండర్సన్‌ బౌలింగ్‌లో పుజారా బ్యాటింగ్‌ సగటు 21.80 కాగా.. టెస్టుల్లో 12 సార్లు అతడు పుజ్జీ వికెట్‌ దక్కించుకున్నాడు. ఇక కమిన్స్‌ బౌలింగ్‌లో పుజారా బ్యాటింగ్‌ యావరేజ్‌ 22.50. కమిన్స్‌ పుజారాను ఎనిమిది సార్లు అవుట్‌ చేశాడు. 

ఆసీస్‌.. వెరీ వెరీ స్పెషల్‌
అయితే, ఓవరాల్‌గా ఆస్ట్రేలియాపై పుజారా బ్యాటింగ్‌ సగటు మాత్రం 47.28గా ఉండటం విశేషం. 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్‌ గెలవడంలో పుజ్జీది కీలక పాత్ర. ఈ సిరీస్‌లో 1258 బంతులు ఎదుర్కొన్న పుజారా.. 521 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

కాగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జన్మించిన 37 ఏళ్ల పుజారా.. 2010లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇక ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ తన చివరి టెస్టు కూడా ఆసీస్‌ మీదే ఆడటం విశేషం. ఇంగ్లండ్‌ వేదికగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌-2023లో పుజారా ఆఖరిగా టీమిండియా జెర్సీలో కనిపించాడు. ప్రస్తుతం అతడు కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.

చదవండి: Asia Cup 2025: 'టీమిండియాపై విజయం మాదే'.. మీకు అంత సీన్ లేదులే! పాక్‌ బౌలర్‌కు కౌంటర్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)