Breaking News

చరిత్ర సృష్టించిన భారత్‌.. చెస్‌ ఒలంపియాడ్‌లో తొలిసారి స్వర్ణం

Published on Sun, 09/22/2024 - 19:53

చెస్‌ ఒలింపియాడ్‌ ఓపెన్‌ విభాగంలో భారత్‌ తొలిసారి స్వర్ణ పతకం సాధించింది. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన 45వ ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు ఈ ఘనత సాధించింది. ఇవాళ (సెప్టెంబర్‌ 22) జరిగిన చివరి రౌండ్‌లో భారత్‌.. స్లొవేనియాపై విజయం​ సాధించి, బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది. 97 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత్‌ స్వర్ణం కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. 2014, 2022 ఎడిషన్లలో భారత్‌ కాంస్య పతకాలు సాధించింది.

స్లొవేనియాతో జరిగిన చివరి రౌండ్‌ పోటీల్లో అర్జున్‌ ఎరిగైసి భారత్‌కు తొలి విజయాన్ని అందించాడు. ఆ తర్వాత డి గుకేశ్‌, ఆర్ ప్రజ్ఞానంద వరుస విజయాలు సాధించి భారత్‌కు స్వర్ణ పతకం ఖరారు చేశారు. ఈ ఎడిషన్‌లో భారత్‌ ఒక్క రౌండ్‌లోనూ ఓడిపోకుండా అజేయ జట్టుగా నిలిచింది. ఆది నుంచి ఎనిమిది రౌండ్ల పాటు విజయాలు సాధించిన భారత్‌.. తొమ్మిదో రౌండ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఉజ్బెకిస్థాన్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అనంతరం టాప్‌ సీడ్‌ యూఎస్‌ఏ, స్లొవేనియాపై విజయాలు సాధించి తిరిగి గెలుపు బాట పట్టింది. 

చదవండి: శెభాష్‌ టీమిండియా.. చదరంగంలో స్వర్ణ చరిత్రకు చేరువలో
 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)