Breaking News

చెన్నై సూపర్‌ కింగ్స్‌లోకి శ్రీలంక కెప్టెన్‌..!?

Published on Thu, 03/14/2024 - 17:34

ఐపీఎల్‌-2024 సీజన్‌కు చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌, కివీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ డెవాన్ కాన్వే దూరమైన సంగతి తెలిసిందే. చేతివేలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌ మొత్తానికి కాన్వే దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని భర్తీ చేసే పనిలో సీఎస్‌కే పడింది. శ్రీలంక కెప్టెన్‌ కుశాల్‌ మెండీస్‌తో కాన్వే స్ధానాన్ని సీఎస్‌కే  భర్తీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే అతడితో సీఎస్‌కే ఫ్రాంచైజీ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్‌-2024 మినీ వేలంలో రూ.50లక్షల కనీస ధరతో వేలంకు వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే  ఇప్పుడు అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుడంతో సీఎస్‌కే అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు సిద్దమైంది.

మెండీస్‌ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా వైట్‌బాల్‌ క్రికెట్‌లో మెండీస్‌ దుమ్ములేపుతున్నాడు. మెండిస్‌ ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో బీజీబీజీగా ఉన్నాడు. ఛటోగ్రామ్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో సైతం మెండిస్‌ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 

అంతకుముందు బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ మెండిస్‌ అదరగొట్టాడు. అదేవిధంగా మెండిస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్ అయినందున తమ జట్టులోకి తీసుకోవాలని సీఎస్‌కే ఫిక్స్‌​ అయినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇక ఐపీఎల్‌-2024 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.  చెపాక్‌ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)