Breaking News

టీమిండియా సెలెక్టర్లకు విషమ పరీక్ష.. ఛాలెంజ్‌ విసురుతున్న మరో ఓపెనర్‌..!

Published on Thu, 07/20/2023 - 14:24

ఇటీవలికాలంలో అదిరిపోయే ప్రదర్శనలతో భారత క్రికెట్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన కొందరు క్రికెటర్లలో 21 ఏళ్ల చెన్నై కుర్రాడు సాయి సుదర్శన్‌ ప్రథముడు. గత ఐపీఎల్‌ సీజన్‌తో వెలుగులోకి వచ్చిన సాయి.. ఆ సీజన్‌లో వరుసగా 22, 62, 53, 19, 20, 41, 43, 96 స్కోర్లు (8 మ్యాచ్‌ల్లో 141.41 స్ట్రయిక్‌ రేట్‌తో 51.71 సగటున 3 అర్ధసెంచరీల సాయంతో 362 పరుగులు) చేసి సత్తా చాటాడు. ఐపీఎల్‌-2023లో సాయి మెరిసినప్పటికీ, రింకూ సింగ్‌ లాంటి ఆటగాళ్ల ఆసాధారణ ప్రదర్శన అతనిని డామినేట్‌ చేసింది.

అయితే అంతటితో ఆగని సాయి.. ఆ తర్వాత జరిగిన తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లోనూ రెచ్చిపోయాడు. ఈ దేశవాలీ లీగ్‌లో 90, 14, 7, 83, 41 స్కోర్లు చేసిన సాయి.. ఈ లీగ్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 172.5 స్ట్రయిక్‌రేట్‌తో 64.20 సగటున 2 అర్ధసెంచరీ సాయంతో 321 పరుగులు చేశాడు. ఈ వరుస సక్సెస్‌లతో సాయికి టీమిండియా నుంచి పిలుపు అందుతుందని అంతా అనుకున్నారు. అయితే అప్పటికే శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైస్వాల్‌, ఇషాన్‌ కిషన్‌లతో టీమిండియా యంగ్‌ ఓపెనర్ల బెంచ్‌ బలంగా ఉండటంతో సాయికి అవకాశం దక్కలేదు.

అయితే, ఈ సీజన్‌లోనే ఎలాగైనా టీమిండియా సెలెక్టర్ల నుంచి పిలుపు అందుకోవాలని పట్టుదలగా ఉండిన సాయి.. ప్రస్తుతం జరుగుతున్న ఏసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ 2023లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 100 స్ట్రయిక్‌రేట్‌తో 170 సగటున సెంచరీ, హాఫ్‌ సెంచరీ సాయంతో 170 పరుగులు చేశాడు. నిన్న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన సాయి, ఈ సారి మాత్రం​ భారత సెలెక్టర్లకు గట్టి ఛాలెంజ్‌ విసిరాడు.

టీమిండియాలో చోటు కోసం తనను తప్పక పరిగణలోకి తీసుకోవాలని బ్యాట్‌తో సవాల్‌ చేశాడు. సాయి ఆడిన ఈ ఇన్నింగ్స్‌ చూసి భారత సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. అసలే ఉన్నవాళ్లకు అవకాశాలు లేక సతమతమవుతుంటే కొత్తగా సాయి తయారయ్యాడేంట్రా అని అనుకుంటున్నారు. ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ అయ్యే లోగా సాయి మరో సెన్సేషనల్‌ ఇన్నింగ్స్‌ ఆడితే ఏం చేయాలో తెలియక వారు లోలోన మధన పడుతున్నారు. మొత్తానికి యువ ఓపెనర్ల విషయం భారత సెలెక్టర్లను విషమ పరీక్షలా మారింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)