Breaking News

బంతి కోసం క్రికెటర్‌ నానాతిప్పలు!

Published on Fri, 03/13/2026 - 11:32

క్రికెట్‌లో ఫన్నీ మూమెంట్స్‌కు కొదువ లేదు. తాజాగా షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో భాగంగా సౌత్‌ ఆస్ట్రేలియా, న్యూ సౌత్‌వేల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక బంతి కోసం ఆటగాళ్లు నానాపాట్లు పడాల్సి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే.. సౌత్‌ ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ సందర్భంగా ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో రియాన్‌ హడ్లే వేసిన షార్ట్‌బాల్‌ను లియామ్‌ స్కాట్‌ స్క్వేర్‌లెగ్‌ దిశగా ఆడాడు. బౌండరీ వైపు దూసుకెళ్లిన బంతి ఫెన్సింగ్‌ అవతల పడింది. అయితే ఈ బంతిని తీయడానికి సౌత్‌ ఆస్ట్రేలియా ఫీల్డర్‌ స్టోబో నానా రకాలుగా ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. 

అనంతరం ఫెన్సింగ్‌ కిందకు దూరి బంతి తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. దీంతో స్టోబో కొద్ది దూరంలో కనిపించిన ఒక చిన్న కట్టెను తీసుకొచ్చి ఫెన్సింగ్‌ అవతల నుంచి మొత్తానికి బంతిని బయటకు తీశాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. 

ఈ వీడియోపై క్రికెట్‌ అభిమానులు వినూత్నంగా స్పందించారు. ‘పాపం మ్యాచ్‌కు మొత్తం ఒకటే బంతి ఉందనుకుంటా.. అందుకే బంతిని తీయడం కోసం తెగ ఆరాటపడిపోతున్నాడు’ అని కామెంట్‌ చేశారు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే సౌత్‌ ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. సౌతా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం న్యూసౌత్‌వేల్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేసింది. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్‌ కావడంతో సౌతా్‌ ఆస్ట్రేలియా టార్గెట్‌ 95 పరుగులుగా నిర్ధేశించబడింది. ఈ టార్గెట్‌ను సౌత్‌ ఆస్ట్రేలియా ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించి విజయాన్ని సొంతం చేసుకుంది.

చదవండి: భారత ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం!

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)