Breaking News

బ్రిజ్‌భూషణ్‌పై చార్జ్‌షీట్‌ దాఖలు

Published on Thu, 06/15/2023 - 13:09

మైన‌ర్‌ను లైంగికంగా వేధించిన‌ట్లు భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు బ్రిజ్ భూష‌ణ్‌(Brij Bhushan)పై రెజ్ల‌ర్లు ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ చేప‌ట్టిన‌ ఢిల్లీ పోలీసులు త‌మ రిపోర్టును రిలీజ్ చేశారు. మైన‌ర్‌ను బ్రిజ్‌ భూషణ్‌ వేధించిన‌ట్లు ఆధారాలు లేవ‌ని పోలీసులు త‌మ  చార్జ్‌షీట్‌లో తెలిపారు. బ్రిజ్‌పై మైన‌ర్ దాఖ‌లు చేసిన ఎఫ్ఐఆర్‌ను ర‌ద్దు చేయాల‌ని ఢిల్లీ పోలీసులు త‌మ రిపోర్టులో కోరారు.

కాగా లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు దాదాపు 1000 పేజీల  చార్జ్‌షీట్‌ రిపోర్టును తయారు చేశారు. కేవ‌లం మైన‌ర్ కేసు విష‌యంలో సుమారు 500 పేజీల నివేదిక‌ను పొందుప‌రిచారు. దాంట్లో ఆ కేసును ర‌ద్దు చేయాల‌ని పోలీసులు సూచించారు.విచార‌ణ‌లో త‌మ‌కు ఎటువంటి ఆధారాలు ల‌భించ‌లేద‌న్నారు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఇవాళ పోలీసులు అధికారులు రిపోర్టును స‌మ‌ర్పించి 1500 పేజీలతో  చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. కాగా పోలీసులు సమర్పించిన  చార్జ్‌షీట్‌పై తదుపరి విచారణను జూన్‌ 22కు వాయిదా వేసింది.

ఏప్రిల్‌లో పోక్సో చ‌ట్టం కింద బ్రిజ్ భూష‌ణ్‌పై ఓ మైన‌ర్ అథ్లెట్ కేసు దాఖ‌లు చేసింది. బ్రిజ్‌పై ఇచ్చిన స్టేట్మెంట్‌ను ఆ మైన‌ర్ వెన‌క్కి తీసుకున్న‌ట్లు పోలీసుల రిపోర్టు ద్వారా తెలుస్తోంది. త‌న‌ను ఎంపిక చేయ‌క‌పోవ‌డం ప‌ట్ల ఆగ్ర‌హంతో డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్‌పై కేసును ఫైల్ చేసిన‌ట్లు ఆ మైన‌ర్ అథ్లెట్ వెల్ల‌డించింది.

చాలా క‌ఠినంగా టోర్నీల కోసం వ‌ర్క్ చేశాన‌ని, కానీ త‌నను సెలెక్ట్ చేయ‌లేద‌ని, దాని వ‌ల్ల డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయాన‌ని, ఆ కోపంతో బ్రిజ్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన‌ట్లు ఆ మైన‌ర్ రెజ్ల‌ర్ పేర్కొన్న‌ది. మైన‌ర్ కేసు విష‌యంలో సీఆర్పీసీ సెక్ష‌న్ 173 కింద రిపోర్టును రూపొందించిన‌ట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. బాధిత మైన‌ర్ తో పాటు ఆమె తండ్రి నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్న‌ట్లు తెలిపారు. జూలై 4వ తేదీన మైన‌ర్ కేసుపై కోర్టు విచార‌ణ జ‌ర‌గ‌నున్న‌ది.

చదవండి: 'టైటిల్‌ గెలిచిన మత్తులో ఎక్కాల్సిన ఫ్లైట్‌ మిస్సయ్యాం'

జూలై 3 నుంచి వింబుల్డన్‌.. ప్రైజ్‌మనీ భారీగా పెంపు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)