Breaking News

CT 2025, IND VS NZ: గ్లెన్‌ ఫిలిప్స్‌ కళ్లు చెదిరే క్యాచ్‌.. కోహ్లికి ఫ్యూజులు ఔట్‌

Published on Sun, 03/02/2025 - 18:33

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 2) జరుగతున్న మ్యాచ్‌లో కివీస్‌ ఆటగాళ్లు మైదానంలో పాదరసంలా కదిలారు. పరుగులు నియంత్రించడంతో పాటు పలు అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు. కివీస్‌ స్టార్‌ ఫీల్డర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ పట్టిన ఓ క్యాచ్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. కెరీర్‌లో 300వ వన్డే ఆడుతున్న విరాట్‌ కోహ్లిని ఫిలిప్స్‌ కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్‌ బాట పట్టించాడు. 

కోహ్లి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా ఆడిన షాట్‌ను ఫిలిప్స్‌ నమ్మశకంకాని క్యాచ్‌గా మలిచాడు.  కుడివైపు గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో సూపర్‌ మ్యాన్‌ క్యాచ్‌ అందుకున్నాడు. కోహ్లి ఆడిన షాట్‌కు ఫిలిప్స్‌ సెకెన్ల వ్యవధిలో రియాక్టయ్యాడు. ఈ క్యాచ్‌ను చూసి కోహ్లి సహా మైదానంలో ఉన్న వారంతా నివ్వెరపోయారు. కోహ్లి సతీమణి అనుష్క అయితే తలపట్టుకుంది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. 

ఈ మ్యాచ్‌లో మరో అద్భుతమైన క్యాచ్‌ కూడా నమోదైంది. రవీంద్ర జడేజాను కేన్‌ విలియమ్సన్‌ సూపర్‌ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. మ్యాట్‌ హెన్నీ (8-0-42-5) ఐదేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో  శ్రేయస్‌ అయ్యర్‌ (79), అక్షర్‌ పటేల్‌ (42), హార్దిక్‌ పాండ్యా (45) రాణించారు. భారత టాప్‌-3 బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్‌ శర్మ 15, శుభ్‌మన్‌ గిల్‌ 2, విరాట్‌ కోహ్లి 11 పరుగులు చేశారు. 

అక్షర్‌ పటేల్‌ ఔటయ్యాక కేఎల్‌ రాహుల్‌ (23) శ్రేయస్‌తో కలిసి కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో జేమీసన్‌, విలియమ్‌ రూర్కీ, మిచెల్‌ సాంట్నర్‌, రచిన్‌ రవీంద్ర తలో వికెట్‌ తీశారు. కాగా, గ్రూప్‌-ఏలో భారత్‌, న్యూజిలాండ్‌ ఇదివరకే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్‌ నామమాత్రంగా జరుగుతుంది. గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి.

తుది జట్లు..

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఓరూర్కీ
 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)