Breaking News

CT 2025, SA VS NZ 2nd Semis: చరిత్ర సృష్టించిన కేన్‌ మామ

Published on Wed, 03/05/2025 - 17:02

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ (South Africa Vs New Zealand) జట్ల మధ్య ఇవాళ (మార్చి 5) రెండో సెమీఫైనల్‌ జరుగుతుంది. లాహోర్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. 33 ఓవర్ల అనంతరం న్యూజిలాండ్‌ స్కోర్‌ 212/1గా ఉంది. విల్‌ యంగ్‌ (21) ఔట్‌ కాగా.. రచిన్‌ రవీంద్ర (108), కేన్‌ విలియమ్సన్‌ (80) క్రీజ్‌లో ఉన్నారు. విల్‌ యంగ్‌ వికెట్‌ లుంగి ఎంగిడికి దక్కింది.

కాగా, ఈ ఇన్నింగ్స్‌లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamson) ఓ అరుదైన మైలురాయిని తాకాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి న్యూజిలాండ్‌ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేన్‌ తన 370వ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం కేన్‌ ఖాతాలో 47 సెంచరీలు, 103 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

కేన్‌ ఒక్క వన్డేల్లోనే 164 ఇన్నింగ్స్‌ల్లో 14 సెంచరీలు, 48 హాఫ్‌ సెంచరీల సాయంతో 7185 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 186 ఇన్నింగ్స్‌ల్లో 33 సెంచరీలు, 37 అర్ద సెంచరీల సాయంతో 9276 పరుగులు.. 93 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 18 హాఫ్‌ సెంచరీల సాయంతో  2575 పరుగులు చేశాడు.  

ఓవరాల్‌గా 16వ ఆటగాడు
అంతర్జాతీయ క్రికెట్‌లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న 12వ ఆటగాడిగా కేన్‌ రికార్డుల్లోకెక్కాడు. కేన్‌కు ముందు సచిన్‌ (34357), సంగక్కర (28016), విరాట్‌ కోహ్లి (27598), రికీ పాంటింగ్‌ (27483), జయవర్దనే (25957), జాక్‌ కల్లిస్‌ (25534), రాహుల్‌ ద్రవిడ్‌ (24208), బ్రియాన​్‌ లారా (22358), సనత్‌ జయసూర్య (21032), శివ్‌నరైన్‌ చంద్రపాల్‌ (20988), జో రూట్‌ (20724), ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ (20580), ఏబీ డివిలియర్స్‌ (20014), రోహిత్‌ శర్మ (19624),  క్రిస్‌ గేల్‌ (19593) ఈ ఘనత సాధించారు. 19000 పరుగుల మైలురాయిని తాకే క్రమంలో కేన్‌ డేవిడ్‌ వార్నర్‌ను (18995) అధిగమించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్‌ తర్వాత అత్యధికంగా రాస్‌ టేలర్‌ 18199 పరుగులు చేశాడు. స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ 15289 పరుగులు సాధించాడు. ప్రస్తుతం కేన్‌ న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక సెంచరీలు (47) చేసిన ఆటగాడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కేన్‌.. మూడు ఫార్మాట్లలో తనదైన ముద్ర వేసి ఈ తరం ఫాబ్‌ ఫోర్‌లో ఒకడిగా కొనసాగుతున్నాడు.

కాగా, ప్రస్తుతం సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో విజేత దుబాయ్‌ వేదికగా జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ మార్చి 9న జరుగనుంది. భారత్‌.. తొలి సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసి వరుసగా మూడోసారి, ఓవరాల్‌గా ఐదోసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)