Breaking News

Champions Trophy 2025: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌.. డబుల్‌ సెంచరీ కొట్టిన షమీ

Published on Thu, 02/20/2025 - 17:55

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా పేసర్‌ మొహమ్మద్‌ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు (43 ఓవర్ల వరకు) తీసిన షమీ.. వన్డేల్లో 200 వికెట్ల పూర్తి చేసుకున్నాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ రికార్డు నెలకొల్పాడు. షమీకి 200 వికెట్లు తీసేందుకు 5126 బంతులు అవసరమయ్యాయి. షమీకి ముందు ఈ రికార్డు మిచెల్‌ స్టార్క్‌ పేరిట ఉండింది. స్టార్క్‌ 5240 బంతుల్లో 200 వన్డే వికెట్ల మైలురాయిని తాకాడు.

బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్లు..
షమీ-5126 బంతులు
స్టార్క్‌- 5240
సక్లెయిన్‌ ముస్తాక్‌- 5451
బ్రెట్‌ లీ- 5640
ట్రెంట్‌ బౌల్ట్‌- 5783
వకార్‌ యూనిస్‌- 5883

  • మ్యాచ్‌ల ప్రకారం చూస్తే.. షమీ.. మిచెల్‌ స్టార్క్‌ తర్వాత అత్యంత వేగంగా 200 వికెట్ల వన్డే మైలురాయిని తాకిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

మ్యాచ్‌ల ప్రకారం అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఆటగాళ్లు..
స్టార్క్‌- 102
షమీ/సక్లెయిన్‌ ముస్తాక్‌- 104
ట్రెంట్‌ బౌల్ట్‌- 107
బ్రెట్‌ లీ- 112
అలన్‌ డొనాల్డ్‌- 117

ఓవరాల్‌గా చూస్తే.. వన్డేల్లో 200 వికెట్లు పూర్తి చేసిన 43 బౌలర్‌గా షమీ రికార్డుల్లోకెక్కాడు. భారత​ తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. షమీకి ముందు అనిల్‌ కుంబ్లే (334), జవగల్‌ శ్రీనాథ్‌ (315), అజిత్‌ అగార్కర్‌ (288), జహీర్‌ ఖాన్‌ (269), హర్భజన్‌ సింగ్‌ (265), కపిల్‌ దేవ్‌ (253), రవీంద్ర జడేజా (226) భారత్‌ తరఫున 200 వికెట్లు తీశారు. జవగల్‌ శ్రీనాథ్‌ (315), అజిత్‌ అగార్కర్‌ (288), జహీర్‌ ఖాన్‌ (269), కపిల్‌ దేవ్‌ (253) తర్వాత 200 వికెట్ల క్లబ్‌లో చేరిన ఐదో భారత పేసర్‌గా షమీ రికార్డు నెలకొల్పాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ ఆదిలో భారత బౌలర్లు చెలరేగడంతో 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తౌహిద్‌ హృదోయ్‌, జాకిర్‌ అలీ (68) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు.  46.2 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్‌ స్కోర్‌ 215/8గా ఉంది. తౌహిద్‌ హృదోయ్‌ (91 నాటౌట్‌), తస్కిన్‌ అహ్మద్‌ క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్‌ రాణా, అక్షర్‌ పటేల్‌ తలో రెండు వికెట్లు తీశారు.  
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)