Breaking News

బెన్‌ డకెట్‌ అరుదైన ఘనత.. వన్డే క్రికెట్‌ చరిత్రలో తొలిసారి 165 స్కోర్‌ నమోదు

Published on Sun, 02/23/2025 - 08:45

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (Ben Duckett) ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 165 పరుగులు స్కోర్‌ చేసిన డకెట్‌.. ఓ యూనిక్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఓ బ్యాటర్‌ నుంచి 165 పరుగుల స్కోర్‌ నమోదైంది. డకెట్‌కు ముందు వన్డేల్లో ఎవరూ ఈ సంఖ్యను (165) నమోదు చేయలేదు. తాజాగా డకెట్‌ 165 పరుగుల స్కోర్‌ చేయడంతో వన్డేల్లో 0 నుంచి 183 పరుగుల వరకు స్కోర్లు కనీసం ఒక్కసారైనా నమోదైనట్లైంది.

ఈ మ్యాచ్‌లో 165 పరుగులు స్కోర్‌ చేయడంతో డకెట్‌ మరిన్ని రికార్డులు సాధించాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ను నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్‌ ఆటగాడు నాథన్‌ ఆస్టిల్‌ (145), జింబాబ్వే ప్లేయర్‌ ఆండీ ఫ్లవర్‌ (145 నాటౌట్‌) పేరిట ఉండింది.  

అలాగే ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన ఆటగాడిగానూ డకెట్‌ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ (141) పేరిట ఉండింది.

తాజా ప్రదర్శనతో డకెట్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన ఆటగాడిగానూ రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు జో రూట్‌ (133 నాటౌట్‌) పేరిట ఉండింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. డకెట్‌ రికార్డు సెంచరీ సాధించినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓటమిపాలైంది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 352 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సునాయాసంగా ఛేదించింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక టీమ్‌ స్కోర్‌ (356/5) కూడా ఇదే.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ బెన్‌ డకెట్‌ (143 బంతుల్లో 165; 17 ఫోర్లు, 3 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. జో రూట్‌ (68) అర్ద శతకంతో రాణించాడు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్‌ (10 బంతులోల​ 21 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో ఇంగ్లండ్‌ 350 పరుగుల మార్కును తాకగలిగింది. ఆసీస్‌ బౌలర్లలో డ్వార్షుయిష్‌ 3, లబూషేన్‌, జంపా తలో 2, మ్యాక్స్‌వెల్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. జోస్‌ ఇంగ్లిస్‌ మెరుపు శతకంతో (120 నాటౌట్‌) విజృంభించడంతో మరో 15 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది.  మాథ్యూ షార్ట్‌ (63), అలెక్స్‌ క్యారీ (69), లబూషేన్‌ (47), మ్యాక్స్‌వెల్‌ (32 నాటౌట్‌) ఇంగ్లిస్‌కు సహకరించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో వుడ్‌, ఆర్చర్‌, కార్స్‌, రషీద్‌, లివింగ్‌స్టోన్‌ తలో వికెట్‌ తీశారు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)