Breaking News

Champions Trophy 2025: ఆరేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ చేసిన రూట్‌

Published on Wed, 02/26/2025 - 22:14

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌ మరో సెంచరీ చేశాడు. రూట్‌.. వన్డేల్లో దాదాపు ఆరేళ్ల తర్వాత శతక్కొట్టాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రూట్‌ సెంచరీతో మెరిశాడు. భారీ లక్ష్య ఛేదనలో రూట్‌ అద్భుతమైన శతకాన్ని సాధించాడు. ఈ మ్యాచ్‌లో రూట్‌ 98 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 

రూట్‌కు వన్డేల్లో ఇది 17వ సెంచరీ. ఓవరాల్‌గా (టెస్ట్‌ల్లో, వన్డేల్లో కలిపి) 53వది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్‌.. విరాట్‌ కోహ్లి తర్వాతి స్థానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు 82 సెంచరీలు చేయగా.. రూట్‌ 53, రోహిత్‌ శర్మ 49, స్టీవ్‌ స్మిత్‌ 48, కేన్‌ విలియమ్సన్‌ 47 అంతర్జాతీయ సెంచరీలు చేశారు. 

రూట్‌ సెంచరీతో ప్రస్తుత ఛాంపియన్స్‌ ట్రోఫీలో సెంచరీల సంఖ్య 11కు చేరింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఏ ఎడిషన్‌లోనూ ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. రూట్‌ వన్డేల్లో చివరిగా 2019లో సెంచరీ చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. రూట్‌ సెంచరీతో మెరిసినా ఇంగ్లండ్‌కు ఓటమి తప్పేలా లేదు. ఆఫ్ఘనిస్తాన్‌ నిర్దేశించిన 326 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ తడబడుతుంది. ప్రస్తుతం ఆ జట్టు 44 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలవాలంటే 36 బంతుల్లో 58 పరుగులు చేయాలి. చేతిలో మరో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. రూట్‌ 107, జేమీ ఓవర్టన్‌ 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఫిల్‌ సాల్ట్‌ 12, బెన్‌ డకెట్‌ 38, జేమీ స్మిత్‌ 9, హ్యారీ బ్రూక్‌ 38, జోస్‌ బట్లర్‌ 38, లివింగ్‌స్టోన్‌ 10 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో ఒమర్‌జాయ్‌, నబీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్‌ ఖాన్‌, గుల్బదిన్‌ నైబ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అంతకుముందు ఇబ్రహీం జద్రాన్‌ రికార్డు శతకంతో చెలరేగడంతో ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో జద్రాన్‌ 146 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 177 పరుగులు చేసి ఔటయ్యాడు. 

ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్‌ (6), సెదికుల్లా అటల్‌ (4), రహ్మత్‌ షా (4) విఫలం కాగా.. హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (41), మహ్మద్‌ నబీ (40) రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్‌ 2, జేమీ ఓవర్టన్‌, ఆదిల్‌ రషీద్‌ తలో వికెట్‌ తీశారు.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)