Breaking News

IPL 2023: పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌.. భారీ రికార్డుపై కన్నేసిన చహల్‌

Published on Wed, 04/05/2023 - 12:23

గౌహతి వేదికగా ఇవాళ (ఏప్రిల్‌ 5) రాజస్థాన్‌ రాయల్స్‌-పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య కీలక సమరం జరుగనుంది. రాత్రి 7: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత ఎడిషన్‌లో ఇరు జట్లు ఆడిన చెరో మ్యాచ్‌లో విజయం సాధించి ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో విజయం సాధించగా.. సన్‌రైజర్స్‌పై రాయల్స్‌ 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, మరో విజయంపై ధీమాగా ఉంది. 

భారీ రికార్డుపై కన్నేసిన చహల్‌..
పంజాబ్‌తో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో రాజస్థాన్‌ స్టార్‌ స్పిన్‌ బౌలర్‌ యుజ్వేంద్ర చహల్‌ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో చహల్‌ ఓ వికెట్‌ పడగొడితే, ఐపీఎల్‌లో అ‍త్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. చహల్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 132 మ్యాచ్‌లు ఆడి 170 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక మాజీ పేసర్‌ లసిత్‌ మలింగ​ సైతం 161 మ్యాచ్‌ల్లో అన్నే వికెట్లు పడగొట్టి ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో చహల్‌తో సమానంగా ఉన్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల రికార్డు కరీబియన్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో (183) పేరిట నమోదై ఉంది. ​సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా మలింగ్‌ రికార్డును సమం చేసిన చహల్‌.. ఈ సీజన్‌లో మరో 14 వికెట్లు పడగొడితే ఐపీఎల్‌లో హైయెస్ట్‌ వికెట్‌ టేకర్‌గా ఆవిర్భవిస్తాడు. ప్రస్తుత సీజన్‌లో చహల్‌కు మినహా మరే బౌలర్‌కు ఈ రికార్డు సాధించే అవకాశం లేదు. 2023 ఐపీఎల్‌ ఆడుతున్న బౌలర్లలో అశ్విన్‌ (రాజస్థాన్‌, 158), భువనేశ్వర్‌ కుమార్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌, 154), సునీల్‌ నరైన్‌ (కేకేఆర్‌, 153) మాత్రమే 150 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఉన్నారు. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)