న్యూజిలాండ్‌ టీ20 టోర్నీ విజేతగా సెంట్రల్‌ డిస్ట్రిక్ట్స్‌

Published on Sun, 02/02/2025 - 16:53

న్యూజిలాండ్‌ టీ20 టోర్నీ సూపర్‌ స్మాష్‌ (Super Smash) విజేతగా సెంట్రల్‌ డిస్ట్రిక్ట్స్‌ (Central Districts) (సెంట్రల్‌ స్టాగ్స్‌) అవతరించింది. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన ఫైనల్లో ఆ జట్టు కాంటర్‌బరీ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెంట్రల్‌ డిస్ట్రిక్ట్స్‌ సూపర్‌ స్మాష్‌ టైటిల్‌ గెలవడం 2019 తర్వాత ఇదే మొదటిసారి. ఇనాగురల్‌ ఎడిషన్‌లో (2006) టైటిల్‌ గెలిచిన కాంటర్‌బరీ కింగ్స్‌ వరుసగా ఐదోసారి, మొత్తంగా ఏడో సారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కాంటర్‌బరీ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన డారిల్‌ మిచెల్‌ (Daryl Mitchell) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మెక్‌కోంచీ (27), చాడ్‌ బోవ్స్‌ (16), షిప్లే (10), మ్యాట్‌ హెన్రీ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. మిచెల్‌ హే (5), మాథ్యూ బాయిల్‌ (2), జకరీ ఫౌల్క్స్‌ (7) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. సెంట్రల్‌ డిస్ట్రిక్ట్స్‌ బౌలర్లలో టాబీ ఫిండ్లే 3 వికెట్లు పడగొట్టగా.. రాండెల్‌ 2, అంగస్‌ షా, టిక్నర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సెంట్రల్‌ డిస్ట్రిక్ట్స్‌.. డేన్‌ క్లీవర్‌ (43), విల్‌ యంగ్‌ (35) రాణించడంతో మరో 16 బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెంట్రల్‌ డిస్ట్రిక్ట్స్‌‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ బాయిల్‌ 5, కెప్టెన్‌ టామ్‌ బ్రూస్‌ 14 పరుగులు చేసి ఔట్‌ కాగా.. విలియమ్‌ క్లార్క్‌ (17), కర్టిస్‌ హీపీ (9) సెంట్రల్‌ డిస్ట్రిక్ట్స్‌ను విజయతీరాలకు చేర్చారు. కాంటర్‌బరీ కింగ్స్‌ బౌలర్లలో కైల్‌ జేమీసన్‌ 2, విలియమ్‌ ఓరూర్కీ, హెన్రీ షిప్లే తలో వికెట్‌ పడగొట్టారు.

కాగా, న్యూజిలాండ్‌లో జరిగే సూపర్‌ స్మాష్‌ టీ20 టోర్నీ 2005-06లో తొలిసారి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ టోర్నీ పలు పేర్లతో చలామణి అవుతూ వస్తుంది. తొలుత న్యూజిలాండ్‌ టీ20 కాంపిటీషన్‌ అని, ఆతర్వాత స్టేట్‌ టీ20 అని, 2009-2012 వరకు హెచ్‌ఆర్వీ కప్‌ అని, 2013-14 ఎడిషన్‌లో హెచ్‌ఆర్వీ టీ20 అని, 2018-19 సీజన్‌ నుంచి సూపర్‌ స్మాష్‌ అని నిర్వహించబడుతుంది. 

ఈ టోర్నీ పురుషులతో పాటు మహిళల విభాగంలోనూ జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ప్రస్తుత సీజన్‌లో సెంట్రల్‌ డిస్ట్రిక్ట్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్‌కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌ జాతీయ జట్టుకు ఆడే చాలామంది ఆటగాళ్లు పాల్గొంటారు.  
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)