Breaking News

యశ్ ధుల్‌ విధ్వంసకర శతకం

Published on Wed, 08/05/2026 - 18:57

ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ 2026లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌ అదరగొట్టింది. పూరానీ ఢిల్లీ 6పై ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌ విజయానికి యువ బ్యాటర్ యశ్ ధుల్‌ సంచలన సెంచరీ ప్రధాన కారణంగా నిలిచింది.

141 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ధుల్‌ 47 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో అజేయ సెంచరీ బాదాడు. ధుల్‌ ఒంటిచేత్తో సెంట్రల్‌ ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు. అతడికి మరో ఎండ్‌లో యుగల్‌ సైనీ (27 నాటౌట్‌) నామమాత్రపు అండగా ఉన్నాడు. సైనీతో కలిసి ధుల్‌ అజేయమైన 81 పరుగులు జోడించి మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. 

అంతకుముందు ధుల్‌ సహ ఓపెనర్‌ సిద్దార్థ్‌ జూన్‌ (8)తో తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. ధుల్‌ ధాటికి సెంట్రల్‌ ఢిల్లీ 13.2 ఓవర్లలో కేవలం వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత పురానీ ఢిల్లీ 7 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్‌ సమర్థ్‌ సేథ్‌ (32) ఓ మోస్తరు స్కోర్‌ చేయగా.. ఆఖర్లో అశ్విని చిల్లర్‌ (38), రోహన్‌ రాఠీ (46) బ్యాట్‌ ఝులిపించారు. సెంట్రల్‌ ఢిల్లీ బౌలర్లలో మోనీ గ్రేవాల్‌ 3, ఖురానా 2, బరోకా ఓ వికెట్‌ తీశారు.

ధుల్ 2022 అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్‌ గెలిపించాడు. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై అతడు‌ 110 పరుగులు చేసి మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ టోర్నీలో ధుల్‌ 4 మ్యాచ్‌ల్లో 229 పరుగులు చేశాడు. సగటు 76.33.

అదే ఏడాది అండర్-19 ఆసియా కప్ గెలిచిన భారత్‌ జట్టులోనూ ధుల్‌ కీలక సభ్యుడు. అండర్‌-19 ప్రదర్శనల తర్వాత ధుల్‌ను భారత క్రికెట్‌లో భవిష్యత్‌ టాపార్డర్ బ్యాటర్‌గా పరిగణించారు. అయితే దురదృష్టవశాత్తు అతడు పెద్దగా రాణించలేకపోయాడు. తాజాగా ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లో చేసిన సెంచరీ అతడి కెరీర్‌ను మలుపు తప్పుతుందేమో చూడాలి. 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)