Breaking News

కెరీర్‌ ముగిసిండేది.. జో రూట్‌పై ఆర్పీ సింగ్‌ సంచలన కామెంట్స్‌

Published on Sat, 02/17/2024 - 21:34

రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌ సీనియర్‌ బ్యాటర్‌ జో రూట్‌ దారుణంగా విఫలమయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన రూట్‌.. ఓ చెత్త షాట్‌ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. టీమిండియా పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో రివర్స్ ర్యాంప్ షాట్‌ ఔటయ్యాడు. కేవలం 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. 

ఈ క్రమంలో రూట్‌ను ఉద్దేశించి భారత మాజీ పేసర్‌ ఆర్పీ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదే షాట్‌ వేరే ఆటగాడు రంజీల్లో గానీ, క్లబ్ స్థాయి క్రికెట్‌లోనైనా ఆడి వుంటే అతడు కెరీర్‌ ముగిసిపోయి ఉండేదని ఆర్పీ సింగ్‌ అన్నాడు. ముందు బ్యాటింగ్‌ టెక్నిక్‌ను సరిచేసుకుని ఆ తరహా షాట్స్‌ ఆడాలని ఆర్పీ సింగ్‌ సూచించాడు.

కాగా ఈ సిరీస్‌లో రూట్‌ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో కనీసం హాఫ్‌ సెంచరీ మార్క్‌ను కూడా అందుకోలేకపోయాడు. ఇక మూడో టెస్టు విషయానికి వస్తే..  టీమిండియా పట్టుబిగించింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. 

యువ‌ ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్‌(104 133 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెలరేగాడు. అతడితో పాటు శుబ్‌మన్‌ గిల్‌(65 నాటౌట్) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు.  టీమిండియా ప్రస్తుతం ఆధిక్యం 322 ప‌రుగుల‌ ఆధిక్యంలో కొనసాగుతోంది.
చదవండి: IND vs ENG: టీమిండియాకు బిగ్‌ షాక్‌.. జైశ్వాల్‌కు గాయం! ఆట మధ్యలోనే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)