Breaking News

అవును... నలుగురు స్పిన్నర్లు ఉండాల్సిందే

Published on Fri, 05/03/2024 - 04:26

ముంబై: వచ్చే నెలలో జరిగే టి20 ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండాలని జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ అన్నాడు. ఎంపికలో ఐపీఎల్‌ ప్రదర్శన చాలా పరిమితమని చెప్పాడు. ఇటీవల ప్రకటించిన భారత జట్టులో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్, యుజువేంద్ర చహల్‌లతో పాటు లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌లకు చోటు దక్కింది. 

గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్‌ మాట్లాడుతూ ‘నలుగురు స్పిన్నర్లు ఎందుకు అవసరమనేది ఇప్పుడే వెల్లడించలేను. కానీ కచ్చితంగా ఉండాలనే అనుకున్నాం. ఇందులో ఇద్దరు ఆల్‌రౌండర్లు (జడేజా, అక్షర్‌) అవసరమైనపుడు బ్యాటింగ్‌లో ఎదురుదాడికి దిగుతారు. పిచ్, ప్రత్యర్థి జట్లను బట్టి మా ‘నలుగురి’ ప్రణాళిక జట్టును సమతూకంగా ఉంచుతుంది. 

మిడిల్‌ ఓవర్లను సమర్థంగా ఎదుర్కొనేందుకే శివమ్‌ దూబేలాంటి హిట్టర్‌ను ఎంపిక చేశాం. ఈ ఐపీఎల్‌తో పాటు గతంలో టీమిండియా తరఫున దూబే బాగా ఆడాడు. ఐపీఎల్‌ కంటే ముందే 70, 80 శాతం జట్టు ఎంపిక కూర్పు జరిగిపోయింది. ఎందుకంటే ఐపీఎల్‌ ప్రదర్శన ఏరోజుకు ఆరోజు మారిపోతూనే ఉంటుంది. దానినే ప్రామాణికంగా తీసుకోలేం. 

కేవలం కొన్ని స్థానాల కోసమే లీగ్‌ను పరిగణనలోకి తీసుకున్నాం’ అని వివరించాడు. జూన్‌ 2 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్‌లలో టి20 ప్రపంచకప్‌ జరుగుతుంది. లీగ్‌ దశ మ్యాచ్‌లన్నీ భారత్‌... అమెరికాలోనే ఆడుతుంది. ఆ తర్వాత సూపర్‌–8 దశ మ్యాచ్‌ల కోసం కరీబియన్‌ దీవులకు టీమిండియా వెళుతుంది.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)