Breaking News

ఒలీ పోప్‌ అజేయ శతకం.. భారీ స్కోర్‌ దిశగా ఇంగ్లండ్‌

Published on Sat, 09/07/2024 - 08:12

లండన్‌: సొంతగడ్డపై సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తున్న ఇంగ్లండ్‌ జట్టు... శ్రీలంకతో మూడో టెస్టులోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకున్న ఇంగ్లండ్‌... శుక్రవారం వర్షం అంతరాయం మధ్య ప్రారంభమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

తాత్కాలిక కెప్టెన్‌ ఒలీ పోప్‌ (103 బంతుల్లో 103 బ్యాటింగ్‌; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా... ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (79 బంతుల్లో 86; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

వీరిద్దరూ వన్డే తరహా ఆటతీరుతో చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వర్షం కారణంగా మ్యాచ్‌కు పలుమార్లు అంతరాయం ఏర్పడగా... ఆఖర్లో వెలుతురు లేమితో ఆటను నిర్ణీత సమయం కంటే ముందే నిలిపివేశారు. 

గత మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన మాజీ కెప్టెన్‌ జో రూట్‌ (13) తో పాటు డాన్‌ లారెన్స్‌ (5) విఫలమయ్యారు. లంక బౌలర్లలో లహిరు కుమార 2 వికెట్లు పడగొట్టాడు. పోప్‌తో పాటు హ్యారీ బ్రూక్‌ (8 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు.
చదవండి: Fab Four: ‘అతడే నంబర్‌ వన్‌.. కోహ్లికి ఆఖరి స్థానం’

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)