Breaking News

మార్క్రమ్‌ చేసిన తప్పు.. ఆలస్యంగా వెలుగులోకి

Published on Sun, 05/14/2023 - 23:23

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేఆఫ్‌ అవకాశాలు దాదాపు ముగిసినట్లే. శనివారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 182 పరుగుల భారీ స్కోరు చేసి కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. అభిషేక్‌ శర్మ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ను ముంచగా.. మిగతా బౌలర్లు కూడా అంతగా రాణించలేకపోయారు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ ఓటమిని మూటగట్టుకుంది.

అయితే మ్యాచ్‌కు ముందు మార్క్రమ్‌ చేసిన తప్పిదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతీ మ్యాచ్‌కు ముందు ఇచ్చే తుది జట్టు షీట్‌ను మార్క్రమ్‌ తప్పుగా ఇచ్చాడు. టాస్‌ సమయంలో చెప్పిన ఆటగాడి పేరు తుది జట్టులో లేకపోగా.. కనీసం సబ్‌స్టిట్యూట్‌గా కూడా లేకపోవడం గమనార్హం. 

విషయంలోకి వెళితే.. వాస్తవానికి లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌ ద్వారా యంగ్‌ బౌలర్‌ సన్విర్‌ సింగ్‌ అరంగేట్రం చేయాల్సింది. మార్క్రమ్‌ కూడా టాస్‌ సమయంలో సన్విర్‌ సింగ్‌ ఐపీఎల్‌తో పాటు ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున డెబ్యూ చేయనున్నట్లు పేర్కొన్నాడు. కానీ సన్వర్‌ సింగ్‌ పేరు ఆ తర్వాత తుది జట్టులో కనిపించలేదు. పొరపాటున అలా జరిగి ఉంటుందిలే అనుకుంటే.. అసలు ఫీల్డింగ్‌.. బ్యాటింగ్‌ ఇలా రెండు సమయాల్లోనూ అతను కనిపించలేదు. ఇక వివ్రాంత్‌ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు.

మాజీ క్రికెటర్‌.. ప్రస్తుతం ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా పనిచేస్తున్న స్కాట్‌ స్టైరిస్‌  ఈ తప్పిదాన్ని గుర్తించాడు. మార్క్రమ్‌ ఇచ్చిన తప్పుడు షీట్‌ను కెమెరా ముందు పెట్టాడు. ఆ షీట్‌లో సన్వర్‌ సింగ్‌ పేరు క్రాస్‌ చేసి నటరాజన్‌ పేరును పెట్టారు. ''ఒక ఆటగాడికి అరంగేట్రం అని చెప్పి ఇప్పుడు అతని పేరు కనిపించకపోవడం అనేది తప్పు. మ్యాచ్‌ అరంగేట్రం చేస్తున్నానన్న సంతోషం కాసేపు కూడా లేకుండా చేశారు. దీనికి మార్క్రమ్‌ బాధ్యత వహించాలి.'' అని పేర్కొన్నాడు.

మరో విశేషమేమిటంటే.. సన్వర్‌ సింగ్‌ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ క్యాప్‌ అందుకున్నాడు. కానీ తుదిజట్టు సహా ఇంపాక్ట్‌ ప్లేయర్లలో ఎక్కడా అతని పేరు కనిపించలేదు. అయితే  ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ సమయంలో నటరాజన్‌ను సన్వర్‌ సింగ్‌ స్థానంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా పంపించినట్లు తెలిసింది. అయితే గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సన్వర్‌ సింగ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

చదవండి: ఔటైతే బాధపడతారు.. కానీ ఇక్కడ సీన్‌ రివర్స్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)