కెప్టెన్‌గా అదుర్స్‌.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన పుజారా

Published on Sat, 04/08/2023 - 11:34

ఇంగ్లండ్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌ డివిజన్‌-2 లో ససెక్స్‌ జట్టుకు టీమిండియా వెటరన్‌ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే పుజారా సెంచరీతో అదరగొట్టాడు.

హోవ్ వేదికగా డర్హామ్‌తో మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో పుజారా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆట సందర్భంగా 55వ ఓవర్‌లో బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన పుజరా.. తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

134 బంతుల్లో పుజరా శతకం సాధించాడు. టామ్ క్లార్క్‌తో కలిసి 112 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని పుజరా నమోదు చేశాడు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 163 బంతులు ఎదుర్కొన్న 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 115 పరుగులు చేశాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ససెక్స్‌ 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. 

ససెక్స్‌ బ్యాటర్లలో పుజరా టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఓలివర్‌ కార్టర్‌(41) పరుగులతో పర్వాలేదనపించాడు.అంతకుముందు డర్హామ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. కాగా ఆస్ట్రేలియాతో వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు పుజారా అద్భుతమైన ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.
చదవండి: IPL 2023 CSK vs MI: సీఎస్‌కేతో మ్యాచ్‌.. సచిన్‌ కొడుకు ఐపీఎల్‌ ఎం‍ట్రీ!

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)