టీ20 ప్రపంచ కప్ 2026కు ఆర్హత సాధించిన కెనడా..

Published on Sun, 06/22/2025 - 15:43

టీ20 ప్రపంచ కప్ 2026కు కెన‌డా జట్టు ఆర్హ‌త సాధించింది. శ‌నివారం కింగ్ సిటీ వేదికగా జరిగిన అమెరికాస్ క్వాలిఫైయర్‌లో బహామాస్‌పై 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన కెన‌డా.. వరల్డ్‌కప్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. పొట్టి ప్రపంపకప్‌నకు కెనడా క్వాలిఫై కావ‌డం ఇదే రెండో సారి.

అమెరికాస్ క్వాలిఫైయర్‌లో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 5 మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించిన కెన‌డా.. పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన బహామాస్ కేవ‌లం 57 ప‌రుగుల‌కే ఆలౌటైంది.

కెనడా బౌలర్లలో కలీం సానా, శివమ్‌ శర్మ తలా మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించగా.. అన్షూ పటేల్‌ రెండు వికెట్లు సాధించారు. అనంతరం 58 పరుగుల లక్ష్యాన్ని కెనడా కేవలం 5.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. కెనడా బ్యాటర్లలో దిల్‌ప్రీత్ బజ్వా(36) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించాడు.

13వ జట్టుగా..
2026 టీ 20 వరల్డ్ కప్‌లో 20 జట్లు బరిలోకి దిగ‌నున్నాయి.  ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్పటికే 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది.  ఆతిధ్య దేశ హోదాలో భార‌త్‌, శ్రీలంక క్వాలిఫై కాగా.. టీ20 వరల్డ్‌కప్‌-2024 టాప్‌-8లో నిలిచిన జట్లు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్,  అఫ్గానిస్తాన్‌, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెస్టిండీస్ నేరుగా ఆర్హ‌త సాధించాయి.

గ‌త టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు అగ్ర‌స్ధానంలో నిలిచినప్ప‌టికి ఆతిథ్య హోదాలో బ‌రిలోకి దిగ‌నుంది. అదే విధంగా టీ20 ర్యాంకింగ్స్‌ ప్రకారం న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, ఐర్లాండ్ కూడా క్వాలిఫై అయ్యాయి. . మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్‌ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి.

అందులో ఇప్పుడు అమెరికాస్ క్వాలిఫైయర్స్ నుంచి 13వ జట్టుగా కెన‌డా ఆర్హ‌త సాధించింది. యూరప్ క్వాలిఫైయర్స్, ఆఫ్రికా క్వాలిఫైయర్స్ నుంచి రెండేసి జ‌ట్లు చొప్పున క్వాలిఫై కానున్నాయి. ఈస్ట్ ఆసియా ఫ‌సిఫిక్‌ క్వాలిఫయర్స్‌ నుంచి మరో మూడు జట్లు ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టనున్నాయి.
చదవండి: IND Vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. వసీం అక్రమ్ రికార్డు బద్దలు
 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)