Breaking News

చరిత్రకు అడుగు దూరంలో శుబ్‌మన్‌ గిల్‌.. అలా అయితే కోహ్లి రికార్డు బద్దలు!

Published on Sun, 05/28/2023 - 15:45

ఐపీఎల్‌-2023 ఫైనల్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఇక ఈ ఫైనల్‌ మ్యాచ్‌ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.  ఈ మ్యాచ్‌లో గెలిచి వరుసగా రెండోసారి ఛాంపియన్స్‌గా నిలవాలని గుజరాత్‌ భావిస్తుంటే.. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి ఐదోసారి ట్రోఫిని ముద్దాడాలని యోచిస్తుంది.

ఇక ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో గిల్ 123 పరుగులు చేస్తే.. ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన కింగ్ కోహ్లిని అధిగమిస్తాడు. ఈ ఏడాది సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన గిల్‌ 851 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు.

అతడి ఇన్నింగ్స్‌లలో 4 హాఫ్‌ సెంచరీలతో పాటు మూడు సెంచరీలు ఉన్నాయి. కాగా అంతకుముందు 2016 ఐపీఎల్‌ సీజన్‌లో విరాట్‌ కోహ్లి 973 పరుగులు చేసి ఈ రికార్డు కలిగి ఉన్నాడు. ఆ ఏడాది సీజన్‌లో 7 హాఫ్‌ సెంచరీలతో పాటు 4 సెంచరీలు సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో కోహ్లి అద్భుతంగా రాణించాడు. ఓవరాల్‌గా 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 6 హాఫ్‌ సెంచరీలు, రెండు సెంచరీలతో పాటు 639 పరుగులు చేశాడు.
చదవండి: IPL 2023: ఒక వేళ వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్‌ విజేత ఎవరంటే?

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు